వివాహ ఆహ్వాన పత్రికలో తమ కుటుంబం పేర్లతో పాటు ఆత్మీయులైన ఐదారుగురి పేర్లు అచ్చువేయించడం సహజం. కానీ ఓ వ్యక్తి ఏకంగా 900 కుటుంబాల పేర్లను శుభలేఖలో అచ్చువేయించాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా మలాపురం పంచాయతీ అధ్యక్షుడైన రమేష్..తన కుమార్తె వివాహం కోసం ఇలా చేశాడు. ఇవాళ తన కుమార్తె షాలిని వివాహం జరగబోతోంది. దీనికోసం మలాపురం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో ఉన్న 900 కుటుంబాలు తమ కుటుంబమేనంటూ రమేశ్ ఆహ్వానం పంపాడు. దీంతో మురిసిపోయిన పంచాయతీ ప్రజలు పెళ్లి పనులు భుజాలపై వేసుకుని సందడి చేస్తున్నారు.