రిలయన్స్ జియోకు వరుసగా రెండో నెలలో కూడా చేదు అనుభవం ఎదురైంది. జనవరిలో జియో నెట్వర్క్ 93.22 లక్షల మంది వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అయితే గత నెలలో కూడా జియోకు కోటి 29 లక్షల మంది దూరమయ్యారు. దీంతో జియో చందాదారుల నష్టం ఫలితంగా, జనవరి చివరి నాటికి వైర్లెస్ బేస్ 9.38 మిలియన్లు తగ్గి 1145.24 మిలియన్లకు చేరుకుంది. భారతి ఎయిర్టెల్ కు జనవరిలో 7,14,199 వినియోగదారులు చేరువయ్యారు. Vodafone Ideaను కూడా జనవరిలో 389,082 మంది వినియోగదారులు వీడారు. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వెల్లడించింది.