ఓ 9ఏళ్ల బాలుడు ఒంటరిగా ఎటువంటి టికెట్లు లేకుండా విమానంలో ప్రయాణించిన ఘటన బ్రెజిల్ లో జరిగింది. ఇమాన్యుయెల్ మార్క్వెస్ ఒలివేరా అనే బాలుడు మనౌస్ నగరంలో ఉన్న తన ఇంటి నుంచి దాదాపు 3వేల కి.మీ దూరం ప్రయాణించాడు. సెక్యూరిటీ కంటపడకుండా, టికెట్ లేకుండా ఎలా వెళ్లాలో గూగుల్ లో సెర్చ్ చేసి మరీ తెలుసుకున్నాడు ఆ బాలుడు. కాగా, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిపై మనౌస్ విమానాశ్రయం అధికారులు విచారణ చేపట్టారు.