ఈ న్యూ ఇయర్‌కి తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాలు

You Say Short News App

నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి తెలంగాణలోని ఈ ప్రాంతాలు అన్యోన్యమైనవి. అత్యుత్తమమైనవి.

లక్నవరం

ప్రకృతి అందాలను చూడాలన్న కుతూహలం ఉన్నవారు తప్పనిసరిగా వెళ్లాల్సిన చోటు.. లక్నవరం. ఇక్కడ వేలాడే వంతెన చాలా ఫేమస్. దీనిపై నడుస్తుంటే భిన్న అనుభూతిని పొందుతాం.

హైదరాబాద్ నుంచి 150కి.మీ దూరంలో ఉందిది. హైవేపై జర్నీ చేస్తుంటే చాలా త్రిల్‌గా అనిపిస్తుంది. ఏటారు నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, లక్నవరం రిసార్ట్ చూడదగినవి. బోటింగ్ మాత్రం మిస్ కాకండి.

బొగత జలపాతం

పచ్చదనాన్ని వెచ్చగా కప్పుకుని.. పరవళ్లు తొక్కుతూ పారే ‘బొగత జలపాతం’ మరో చూడదగ్గ ప్రదేశం. తెలంగాణ నయాగార జలపాతాలుగా వీటికి పేరుంది.

సుమారు 30ఫీట్ల ఎత్తునుంచి జాలువారే ఈ జలపాతాల సవ్వడిని వింటే పొందే అనుభూతే వేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇది ఉంది.

మెదక్ చర్చ్

ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతతను పొందే చోటే మెదక్ చర్చి. ఆసియాలోనే అతిపెద్ద బిషప్ చర్చ్ ఇది. చర్చి నిర్మాణశైలి మనల్ని కట్టిపడేస్తుంది.

ఇక్కడ క్రిస్‌మస్‌తో పాటు న్యూ ఇయర్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. మెదక్ కోట, నర్సాపూర్ అడవి, సింగూరు డ్యాం చూడాల్సిన ప్రదేశాలు.

పాపికొండలు

పాపికొండలు అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. గోదావరి నది పాయగా మారి.. ఈ కొండల నడుమ నుంచి ప్రయాణిస్తుంది.

ఒక్కోసారి కశ్మీర్ అందాలను చూసిన అనుభూతి కలగక మానదు. బోటింగ్‌ని ఆస్వాదించాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే.

ఇక ఇక్కడ శిబిరాలను ఏర్పాటు చేసుకుని.. భోగిమంటలను పెట్టుకుంటే మరొక ప్రపంచంలో ఉన్నట్టుంటుంది.

నాగార్జున సాగర్

మానవుడు సృష్టించిన అద్భుతమే ‘నాగార్జున సాగర్’. చుట్టూ హరితహారంతో కూడుకుని.. చూపరులను ఇట్టే ఆకట్టుకోగల నిర్మాణం ఇది.

హైదరాబాద్ నుంచి 150కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్గొండ జిల్లాలో కృష్ణానదిపై నిర్మితమైన అతి పొడవైన డ్యాం ఇది.

నల్లమల్ల అడవుల అందాలను తిలకిస్తూ సమీపంలోని శ్రీశైలంని కూడా దర్శించుకోవచ్చు.

కిన్నెరసాని వన్య‌ప్రాణి సంరక్షణ కేంద్రం మరో చూడదగ్గ ప్రదేశం. రాష్ట్రంలోని అతిపెద్ద వణ్యప్రాణి సంరక్షణ కేంద్రమైన కిన్నెరసాని ఖమ్మం జిల్లాలో ఉంది.

కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

హైదరాబాద్ నుంచి 300కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాపికొండలు వెళ్లినవారూ ఇక్కడికి చేరుకోవచ్చు.