2022లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోయిన్లు
YouSay Short News App
ఏటా తెలుగు తెరపై ఎంతోమంది తారలు ప్రత్యక్షమవుతుంటారు. అలా 2022లోనూ చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
వీరిలో కొందరు మొదటిసారిగా పరిచయమైతే.. వేరే భాషల్లో స్టార్లుగా ఉన్న నటీమణులు తెలుగులో తొలిసారిగా నటించారు..
హిందీలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న అలియా భట్ ఈ ఏడాది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఆ తర్వాత్ర బ్రహ్మాస్త్ర సినిమాతో మరోసారి పలకరించింది.
అలియా భట్
బాలీవుడ్‌లో పేరొందిన మహేశ్ మంజ్రేకర్ కుమార్తె.. సయీ మంజ్రేకర్. ఈ చిన్నది 2022లో రెండు తెలుగు సినిమాల్లో నటించింది. వరుణ్ తేజ్ ‘గని’ సినిమాతో అరంగేట్రం చేసి.. అడివి శేష్ ‘మేజర్’తో హిట్ అందుకుంది.
సయీ మంజ్రేకర్
సీతారామం సినిమాతో ఈ భామ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. సీతగా తెలుగు అభిమానులకు చేరువైంది. ఎంతో మోడ్రన్‌గా ఉండే మృణాల్.. ఈ సినిమాలో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించి వారెవ్వా అనిపించింది.
మృణాల్ ఠాకూర్
చుంకీ పాండే కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి ‘అనన్య పాండే’. విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా ద్వారా ఈ కుర్రది పరిచయమైంది. సినిమా విజయం సాధించనప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరైంది.
అనన్య పాండే
భీమ్లా నాయక్ సినిమా ద్వారా పరిచయమైన మరో నటి ‘సంయుక్త’. ఇందులో రానా భార్యగా నటించింది. అలాగే, కళ్యాణ్ రామ్ బింబిసారలోనూ హీరోయిన్‌గా మెరిసింది.
సంయుక్త
రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నజ్రియా. అయితే, నేరుగా తెలుగు సినిమా చేసింది మాత్రం ఈ ఏడాది లోనే. నాని ‘అంటే సుందరానికి’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
నజ్రియా నజీర్
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ ‘మిథిలా పాల్కర్’. విశ్వక్‌సేన్ ‘ఓరి దేవుడా’ చిత్రంతో పలకరించింది. ఇందులోనే నటించిన మరో హీరోయిన్ ‘ఆశా భట్’కి కూడా ఇదే తొలి తెలుగు సినిమా.
మిథిలా పాల్కర్
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ఒలీవియా మోరిస్. ఎన్టీఆర్ ప్రేయసిగా నటించి ఆకట్టుకుంది.
ఒలీవియా
న్యూజిలాండ్ భామ షిర్లే సేథియా.. ‘కృష్ణ వ్రింద విహారి’ ద్వారా పరిచయమైంది.
షిర్లే సేథియా
మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా ద్వారా పరిచయమైన నటి సౌమ్య మేనన్. ఇందులో కీర్తి సురేష్‌కి స్నేహితురాలిగా కనిపించింది.
సౌమ్య మేనన్
రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రజీషా విజయన్ పరిచయమైంది.
రజీషా విజయన్
గాడ్సే సినిమాతో ద్వారా ‘ఐశ్వర్యా లక్ష్మి’ ఎంట్రీ ఇచ్చింది.
ఐశ్వర్యలక్ష్మి
కన్నడ భామ కావ్యా శెట్టి ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.