ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడిగా పేరొందిన ఆటగాడు ‘పీలే’. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో బ్రెజిల్ నేడు
ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణం పీలే అని సగర్వంగా చెప్పొచ్చు.
తండ్రి నుంచి ఫుట్‌బాల్ ఆటను పునికి పుచ్చుకుని ప్రపంచమే మెచ్చే ఆటగాడిగా పీలే ఎదిగాడు. బాల్యం నుంచే ఈ క్రీడపై ఆసక్తి పెరగడానికి కారణం నాన్నేనని పీలే గతంలో వెల్లడించాడు.
కెరీర్‌లో ఓవరాల్‌గా 1,366 మ్యాచులు ఆడి 1,281 గోల్స్ చేసిన ఆటగాడిగా పీలే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. అధికారిక టోర్నమెంట్ల పరంగా 812 మ్యాచులాడిన పీలే 757 గోల్స్ ఖాతాలో వేసుకున్నాడు.
బ్రెజిల్ జట్టు తరఫున పీలే 112 మ్యాచులు ఆడాడు. అధికారిక మ్యాచుల్లో పీలే 77 గోల్స్ చేయగా.. మిగతా వాటిల్లో ఆడి మరో 18 గోల్స్ కొట్టాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు కూడా పీలేనే కావడం విశేషం. నెయ్‌మర్(77) పీలేతో సమానంగా ఉన్నాడు.
మూడు ఫిఫా ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ప్లేయర్ పీలేనే. 1958, 1962, 1970ల్లో బ్రెజిల్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మూడు సందర్భాల్లోనూ పీలే జట్టు సభ్యుడిగా ఉన్నాడు. మొత్తంగా పీలే 4 ప్రపంచకప్‌లలో ప్రాతినిథ్యం వహించాడు.
తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీ(1958) గెలిచినప్పుడు పీలే వయసు కేవలం 17ఏళ్లే. ఫైనల్ మ్యాచులో రెండు గోల్స్ కొట్టి జట్టుకు టైటిల్ అందించాడు.
ఈ టోర్నీలో పీలే 6 గోల్స్ చేసి.. ఉత్తమ యంగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు.
20వ శతాబ్ద అథ్లెట్‌గా పీలేని 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. అంతేగాకుండా 20వ శతాబ్ద అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో టైమ్స్ గ్రూప్ పీలేని చేర్చింది.
ఫుట్‌బాల్ చరిత్రలో జెర్సీ నెం.10కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. పీలే జెర్సీ నంబర్ కూడా 10. విచిత్రంగా దిగ్గజాలైన మరడోనా, మెస్సీల జెర్సీ సంఖ్య కూడా 10 కావడం గమనార్హం. భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ జెర్సీ నంబర్ కూడా 10.
పీలే పేరిట బ్రెజిల్‌లో ఒక మ్యూజియం కూడా ఉంది. ఇందులో పీలేకి సంబంధించిన అన్ని ఆనవాళ్లను భద్రపరిచారు. బూట్లు, జెర్సీ, ఫుట్‌బాల్.. వంటివి ఇందులో మనం తిలకించొచ్చు.
ఈ మ్యాచులో పీలేని ఒక్క గోల్ కూడా చేయనీయకుండా ప్రత్యర్థి జట్టు అడ్డుకుంది. దీంతో భారత్ క్లబ్ ఫుట్‌బాల్ ప్రతిభను మెచ్చుకుంటూ గ్రేట్ ఇండియా అంటూ సంబోధించాడు.