అయితే ఈ డెక్సా టెస్ట్, యో యో టేస్టులు గురించి చాలామందికి తెలియదు. వాటిని ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారో ఓ సారి చూద్దాం
డెక్సా టెస్ట్ ద్వారా క్రికెటర్ల ఫిట్నెస్ను పరీక్షిస్తారు. ఆటగాళ్ల శరీరంలోని కొవ్వు శాతం, కండరాల శక్తి, శరీరంలోని నీరు, ఎముకల దృఢత్వంలాంటివి తెలుసుకుంటారు.
డెక్సా టెస్ట్ అంటే..
శరీరంలో ఎక్కడ ఫ్యాట్ అధికంగా ఉందో తెలుసుకుని.. దానిని తగ్గించేందుకు శిక్షణ ఇస్తారు. అలాగే ప్రస్తుతం ఇస్తున్న ట్రైనింగ్ ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో తెలుసుకుంటారు.
క్రికెటర్ శరీరంలో కొవ్వు శాతం 10 కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ 10 - 12 మధ్య ఉంటే అది తగ్గించుకోవాలి.
క్రికెటర్లలో కొవ్వు శాతం ఎంత ఉండాలి?
అదే ఫుట్ బాల్ ఆటగాళ్లకైతే 5-8 శాతం వరకే ఉండాలనేది నిబంధన.క్రికేటర్లకు మాత్రం 10 వరకూ ఉన్నా సరిపోతుంది.
శరీరంలో కొవ్వు తక్కువగా ఉంటే.. కండరాల శక్తి ఎక్కువగా ఉండి.. శరీరానికి అధిక బలం, శక్తి, వేగం, చురుకుదనం లభిస్తాయి.
డెక్సా స్కాన్ టెస్ట్ ద్వారా క్రికెటర్ల పూర్తి ఫిట్నెస్ను అంచనా వేయవచ్చు. ప్రతి క్రికెటర్ రోజువారీ కార్యకలాపాలు, ఆహారం, శిక్షణ పద్ధతులను నిర్ణయించవచ్చు.
డెక్సా స్కాన్ ఉపయోగం
యో-యో టెస్టు కూడా ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించడంలో భాగంగా చేస్తారు.
యో-యో టెస్టు అంటే ఏమిటి?
రెండువైపులా 20 మీటర్ల దూరంలో రెండు లక్ష్యాలను (కోన్స్) ఏర్పాటు చేస్తారు.ఈ రెండు కోన్స్ మధ్య ఆటగాళ్లను పరుగెత్తిస్తారు. బీప్ సౌండ్ వచ్చేలోపు అవతలి లక్ష్యం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది.
ఎలా చేస్తారు?
పంత్‌కే కాకుండా.. భారత జట్టుకు కూడా ఇది లోటే. 2023లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలో కీలక ఆటగాడైన పంత్ లేకపోవడం జట్టు బలాన్ని తగ్గిస్తుంది.
జట్టుకు లోటు
తొలుత బీప్- బీప్ సౌండ్‌కి మధ్య కాస్త ఎక్కువ సమయం ఇస్తారు. తర్వాత ఈ సమయాన్ని తగ్గిస్తూ వెళ్తారు.
దీనికి అనుగుణంగా ఆటగాళ్లు తమ వేగాన్ని పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ ఆటగాళ్లు ఆ స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారని అనిపిస్తే టెస్టును మధ్యలోనే ఆపేస్తారు.
ఇదంతా కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రామ్ ద్వారా నిర్వహించి పాయింట్లు నమోదు చేస్తారు. ఆ పాయింట్ల ఆధారంగా ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారో లేదో తేలుస్తారు.
ఈ ఏడాది స్వదేశంలో ప్రపంచకప్ జరగనుంది. టీమిండియాలో గాయాల బెడద ఎక్కువైంది. కొంతమంది ఆటగాళ్లు తమ గాయాలను దాచి పెట్టి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అలాంటి ప్లేయర్స్‌ను అడ్డుకుని ఫిట్నెస్ పరీక్షలను బీసీసీఐ తప్పనిసరి చేసింది.
ఇప్పుడేందుకు ఈ టెస్టులు?
ప్రస్తుతం 20 మంది ప్లేయర్స్‌ను 2023 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్ల ఆటగాళ్ల గాయాలు, మ్యాచ్‌లపై వాటి ప్రభావాన్ని తగ్గించాలని చూస్తోంది.
ప్రపంచకప్ నాటికి ఆటగాళ్లను మెరికళ్లా తీర్చిదిద్దాలని యోచిస్తోంది.