ws_Snapinsta.app_1080_315070347_213716201087260_4171862645192515975_n

YouSay Short News App

షోయభ్‌ అక్తర్‌ నుంచి ఉమ్రాన్‌ మాలిక్‌ దాకా ఫాస్టెస్ట్‌ బౌలర్లు వీరే!

ws_Snapinsta.app_1080_309321572_769870417604228_2814444170712232215_n

అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ బాల్. ప్రస్తుతం ఇదొక పెద్ద టాపిక్. ఎందుకంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన బంతే కారణం.

ws_Snapinsta.app_1080_316724485_1790435447979236_3243464375223643280_n

ఈ కశ్మీర్‌ స్పీడ్‌ గన్‌ 155 kmph వేగంతో బంతి విసిరి బుమ్రాను అధిగమించాడు. దీంతో అసలు  ఏ బౌలర్లు ఎంతవేగంతో బంతులు వేస్తారనే విషయాన్ని నెటిజన్లు శోధిస్తున్నారు. మీరు కూడా అదే పనిలో ఉంటే ఇది చదవండి చాలు.

ws_51RV7viPCaL

క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగమైన బంతి  పాకిస్థాన్‌ బౌలర్‌ షోయబ్ అక్తర్‌దే. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 161.3 kmph వేగంతో బాల్‌ వేసి రికార్డు సృష్టించాడు.

షోయబ్‌ అక్తర్‌

ws_Snapinsta.app_1080_313895463_673842947648345_2712992660276165849_n

ఆసీస్‌ జట్టులో ప్రత్యర్థులను గడగడలాడించే బౌలర్లలో బ్రెట్‌ లీ ఒకడు. 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 మైళ్ల వేగంతో అంటే 161.1kmph వేగంతో బాల్‌ విసిరాడు.

బ్రెట్‌ లీ

ఈ రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌కు పెద్దగా పేరు రాలేదు. తక్కువకాలం పాటు ఆస్ట్రేలియా టీమ్‌కు ఆడాడు. ఇంగ్లాండ్‌ మీద 161.1kmph వేగంతో బంతి వేసిన టైట్‌, బ్రెట్‌ లీ రికార్డ్‌ సమం చేశాడు.

షాన్ టైట్‌

ఎడమ చేతి వాటం కలిగిన వారిలో స్టార్క్‌ వైవిధ్యమైన బౌలర్. కివీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో 160.4 kmphతో బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌ భయపెట్టాడు.

మిచెల్ స్టార్క్‌

వెస్టిండీస్‌కు చెందిన బౌలర్‌ ఆండీ రాబర్ట్‌ అప్పట్లోనే ఓ సంచలనం. 1975లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 159.5kmph వేగంతో బాల్‌ విసిరి సెట్‌ చేశాడు.

ఆండీ రాబర్ట్స్‌

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్ల సరసన ఈ కరేబియన్ ఆటగాడు నిలిచాడు. సౌతాఫ్రికాపై 157.7kmph వేగంతో బౌలింగ్‌ చేశాడు ఎడ్వర్డ్స్‌.

ఫిడెల్ ఎడ్వర్డ్స్‌

టెక్నిక్‌తో పాటు వైవిధ్యం కలిగిన బౌలర్లలో మేటి మిచెల్ జాన్సన్. 2013 యాశెస్‌ సిరీస్‌లో 156.8 kmph వేగంతో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడుు ఈ ఫ్రెంచ్ గడ్డం క్రికెటర్‌.

మిచెల్ జాన్సన్‌

పాకిస్తాన్‌ టాప్‌ బౌలర్లలో అక్తర్‌ తర్వాత సమీదే టాప్‌ ప్లేస్‌. 156.4 kmph స్పీడ్‌తో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో వేసి టాప్‌ టెన్‌లో నిలిచాడు.

మెుహమ్మద్‌ సమీ

వాస్తవానికి సమీ అత్యంత ఫాస్టెస్ట్‌ బాల్ విసిరిన  వారిలో మెుదటిస్థానంలో నిలవాలి. ఎందుకంటే  ఓ మ్యాచ్‌లో అతడు 164 kmphతో బౌలింగ్ వేశాడు. కాకపోతే అది స్పీడో మీటర్‌ తప్పిదమంట.

యార్కర్స్‌, బౌన్సర్స్‌ వేయడంలో దిట్ట షేన్ బాండ్. ఇతడిని న్యూజిలాండ్‌ స్పీడ్‌ స్టార్ అంటారు. 2003 ప్రపంచకప్‌లో ఇండియాపై 156.4kmphతో బౌలింగ్‌ చేశాడు.

షేన్ బాండ్

ప్రస్తుతం బౌలింగ్‌ చరిత్రలో సంచలనం ఉమ్రాన్ మాలిక్‌. ఇటీవల 155 kmph వేగంతో అతడి అంతర్జాతీయ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ బాల్‌ వేశాడు. అవకాశం వచ్చిన కొన్ని మ్యాచ్‌లకే రికార్డు నెలకొల్పాడు.

స్పీడ్‌ గన్‌ ఉమ్రాన్‌

ఉమ్రాన్‌ మాలిక్‌ ఇంతకన్నా వేగంగా బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్‌లో అతడు రికార్డు 157kmph. కానీ, దీన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో పరిగణించరు.