కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ స్టోరీ లైన్ ఇదే! సిక్రెట్ ఆపరేషన్‌లో ముగ్గురు…
YouSay Short News App
2022లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కల్యాణ్ రామ్ మరో విభిన్నమైన స్టోరీతో వస్తున్నాడు. సినిమాకు టైటిల్ కూడా అంతే భిన్నంగా అమిగోస్ అని పెట్టారు.
అమిగోస్‌లో త్రిపాత్రిభినయం చేస్తున్నాడు నందమూరి హీరో. మూడు విలక్షణమైన పాత్రలతో విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
అమిగోస్ టైటిల్‌తోనే ఆసక్తి కలిగించింది చిత్రబృందం. ఇది ఒక స్పానిష్ పదం. దీన్ని స్నేహితులను పిలవడానికి వాడుతుంటారని టాక్.
అమిగోస్ అర్థం
సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
సూపర్ లుక్స్
ప్రచార చిత్రాల్లో మెుదట్నుంచి డోపుల్ గ్యాంగర్ పదం వినిపిస్తుంది. రక్తసంబంధం లేకుండా ఒకే పోలికలతో మరొకరు ఉండటాన్ని డోపుల్ గ్యాంగర్ అంటారు.
డోపుల్ గ్యాంగర్
కళ్యాణ్ రామ్ చేసే మూడు పాత్రల్లో ఒకరి పేరు సిద్దార్థ్. దీనికోసం కల్యాణ్ రామ్ వ్యాపారిగా కనిపించనున్నాడు. ఇందులో స్టైలిష్ లుక్
బాగుంది.
సిద్ధార్థ్
అమాయకమైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు సంబంధించిన మరో లుక్ మంజునాథ్. డోపుల్ గ్యాంగర్‌లో రెండో వ్యక్తి.
మంజునాథ్
ఇందులో మరో ముఖ్యమైన పాత్ర మైఖేల్. మరోసారి నెగటివ్ షేడ్‌లో కల్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. టీజర్‌లో మాస్ లుక్, హస్కీ వాయిస్‌తో ఇప్పటికే ప్రేక్షకులకు ఎక్కేసింది.
మైఖేల్ from కోల్‌కతా
మైఖేల్ పాత్రలో కళ్యాణ్ రామ్ మరోసారి విలన్‌గా కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. టీజర్‌లో మిగతా ఇద్దరిని నాతో పిల్లి, ఎలుక ఆట ఆడుతారా అంటూ భయపెట్టే సీన్ కూడా అలానే కనిపిస్తుంది.
పిల్లి, ఎలుక ఆట
ఆమిగోస్ అనే ఓ సిరియస్ సిక్రెట్ ఆపరేషన్‌లో ఈ ముగ్గురు కలిసి పనిచేస్తారని.. ఇదే కథకు ప్రధానం అని తెలిసింది.
కథ గురించి
కల్యాణ్ రామ్ మరోసారి కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. రాజేంద్ర రెడ్డి అనే వ్యక్తిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.
కొత్త దర్శకుడు
ఇప్పటికే పటాస్‌తో అనిల్ రావిపూడి, బింబిసారతో వశిష్ఠ్, 118 ద్వారా కెవి గుహన్‌లను దర్శకులుగా పరిచయం చేశాడు కల్యాణ్ రామ్.
మరికొంతమంది
అమిగోస్ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.