ఆస్కార్‌ నామినేషన్స్‌ రేసులో 10 భారతీయ సినిమాలు… RRRకు ఆస్కార్ దక్కుతుందా?

YouSay Short News App

భారత చలన చిత్ర పరిశ్రమ నుంచి గతేడాది ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు వచ్చాయి. రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌ నుంచి కన్నడ కాంతార వరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ రేసులో ఇండియన్‌ సినిమాలు నిలిచాయి. అధికారికంగా చల్లో షో బరిలో నిలిచింది. ఇక నామినేషన్స్ బరిలో నిలిచిన 301 చిత్రాల్లో దాదాపు 10 భారతీయ  సినిమాలు ఉన్నాయి.

గుజరాతీ సినిమా ‘ఛల్లో షో’ భారత్ నుంచి ఆస్కార్‌కు  అధికారికంగా ఎంపికైంది. గ్రామీణ నేపథ్యంలో ఓ కుర్రాడు తన కలను నెరవేర్చుకోడానికి ఎంత కష్ట పడ్డాడు అనే ఇతివృత్తంగా ‘ఛల్లో షో’ సినిమా తెరకెక్కింది.

ఛల్లో షో

ఈ సెన్సెటివ్ కథాంశమే ఛల్లో షోను ఆస్కార్ బరిలో నిలిపింది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ ఒక విజువల్‌ ఫీస్ట్‌. ఎన్టీఆర్‌, తారక్‌ నటనకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.

ఆర్‌ఆర్‌ఆర్‌

ఆస్కార్‌ నామినేషన్స్‌లో బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు కోసం పోటీ పడుతుంది.

కన్నడ చిత్రం కాంతారా ప్రభంజనం అంతా ఇంతా కాదు. క్లైమాక్స్‌లో రిషబ్‌ షెట్టి నటన ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమా బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్‌ విభాగాల్లో అర్హత సాధించింది.

కాంతారా

కశ్మీరీ పండిట్‌ హత్యలపై వివేక్‌ అగ్ని హోత్రి తీసిన కశ్మీరీ ఫైల్స్‌ ఓ సంచలనం. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్‌ నుంచి భారీ రెస్పాన్స్‌. చిత్రాన్ని నామినేషన్స్‌లో నిలిపింది.

ది కశ్మీర్ ఫైల్స్‌

నిజజీవత సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దిన చిత్రం గంగుభాయ్‌ కతియావాడి. ఇందులో అలియాభట్‌ వేశ్య పాత్రలో యాక్టింగ్ ఇరగదీసింది. సామాజిక అంశాలు స్పృషించడంతోనే రేసులో ఉందని చెప్పవచ్చు.

గంగుభాయ్‌ కతియావాడి

కిచ్చ సుదీప్‌ హీరోగా క్రైమ్ థ్రిల్లర్‌ జోనరల్‌ డిఫరెంట్‌గా రూపొందించారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఐటెమ్ సాంగ్‌ ఊపేసింది. క్రిటిక్స్‌ మెప్పు పొందటంతో సినిమా ఆస్కార్‌  నామినేషన్స్‌ వరకు వెళ్లింది.

విక్రాంత్‌ రోణ

తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త నంబినారణ నిజ జీవితంలో జరిగిన కథ. రాజకీయాల నేపథ్యంలో తప్పుడు కేసులో ఇరికించడంతో అతడి కుటుంబం ఎలా చిధ్రమైందో చూపించారు.

రాకెట్రీ

మాధవన్, సిమ్రాన్‌ పండించిన ఎమోషన్స్‌ ప్రేక్షకులను కంటతడి పెట్టించటమే బరిలో నిలవటానికి కారణం.

మీ వసంతరావ్, తుజ్యా సాథీ కహీ హై, ఇరవిన్‌ నిళల్‌ సినిమాలు కూడా నామినేషన్‌ రేసులో ఉన్నాయి.

మరికొన్ని

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌, కాంతారా సినిమాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక కేటగిరీలో ఎంపిక కావచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

అవకాశం ఉందా?