ఆస్కార్ అవార్డును ఒడిసిపట్టేందుకు నాటు నాటు పాట మరొక అడుగు దూరంలో ఉంది. ఆస్కార్‌ను సాధించాలని యావత్ భారతీయ సినీ ప్రపంచం కోరుకుంటోంది. ఈక్రమంలో నాటు నాటు సాంగ్‌కు పోటీగా నిలిచిన పాటలేవో ఓసారి చూద్దాం.
అమెరికాలోని కాలిఫోర్నియాలో 'నాటు నాటు' సాంగ్ నామినేషన్‌ను ఆస్కార్ అకాడమి అధికారికంగా ప్రకటించింది
కొద్దిరోజుల క్రితమే ఆస్కార్ పురస్కారాల్లో 15 పాటల తుది జాబితాకు ‘నాటు నాటు’ సాంగ్ ఎంపికైంది.తాజాగా ఆస్కార్ షార్ట్ లిస్ట్ చేసిన ఐదు పాటల్లో ఓ నామినేషన్‌ను కైవశం చేసుకుంది.
‘టెల్ ఇట్ లైక్ ఎ వుమెన్’ చిత్రంలోని
అప్లాజ్ సాంగ్..
నాటు నాటుకు పోటీ
‘టాప్ గన్: మేవరిక్’లో హోల్డ్ మై హ్యాండ్...
‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ చిత్రంలోని
లిఫ్ట్ మి అప్...
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని
దిస్ ఈజ్‌ఎ లైఫ్.. పాటలతో నాటు నాటు ఫైనల్లో పోటీ పడుతోంది.
ఆస్కార్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ పొందిన తొలి ఇండియన్ సాంగ్
నాటు నాటు
తొలి ఇండియన్ సాంగ్‌గా..
గతంలో AR రెహమాన్ స్వరపరిచిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లోని జయ హో... పాట ఉత్తమ స్కోర్ విభాగంలో ఆస్కార్ పొందింది. కానీ ఆ చిత్రం బ్రిటన్ రూపకర్తలు నిర్మించారు.
నాటు నాటు...’ ఆస్కార్ గెలిస్తే తొలి భారతీయ గీతంగా చరిత్ర సృష్టిస్తుంది
బెస్ట్ యాక్టర్‌తో పాటు మరికొన్ని విభాగాల్లో RRR పోటీపడినా నామినేషన్ దక్కలేదు.
ఆస్కార్ 95 పురస్కారాల కోసం రూపొందించిన ప్రోమోలో RRR చోటు దక్కింది.
మినీ ఆస్కార్గా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు నాటు నాటు సాంగ్‌కు ఇప్పటికే లభించింది.
ఈ అవార్డు పొందితే 90% ఆస్కార్ దక్కడం ఖాయం అనే భావన ఉంది.
‘నాటు నాటు’ అవార్డులు
28th ఎడిషన్ క్రిటిక్ ఛాయిస్ అవార్డు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు దక్కింది సాటిలైట్ అవార్డు వేడుకల్లో ఉత్తమ గీతం అవార్డును పొందింది.