REVIEW: కల్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’ కొత్తగా ఉంది కానీ..!

YouSay Short News App

నందమూరి ఫ్యామిలీ సినిమా ప్రయోగాలకు పెట్టింది పేరు కల్యాణ్ రామ్. రెగ్యులర్‌ కమర్షియల్ సినిమాల కన్నా ప్రయోగాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటాడు. ఇటీవల బింబిసారతో కమర్షియల్‌ హిట్‌ కొట్టాక, మరోసారి డోపుల్‌గ్యాంగర్స్‌ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ‘అమిగోస్‌’ చేశాడు.

టైటిల్‌ అనౌన్స్‌ చేసిన దగ్గర్నుంచి లుక్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఇలా అన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి తెరపై అదే స్థాయిలో సినిమా ఆకట్టుకుందా? చూద్దాం.

నటీ నటులు     : కల్యాణ్‌ రామ్‌, అషికా రంగనాథ్‌ రచన, దర్శకత్వం : రాజేంద్ర రెడ్డి నిర్మాత          : మైత్రి మూవీ మేకర్స్ సంగీతం        : జిబ్రాన్‌ సినిమాటోగ్రఫీ    : సౌందరరాజన్‌ ఎడిటింగ్‌        : తమ్మిరాజు

చిత్రబృందం:

హైదరాబాద్‌లో ఉండే సిద్దార్థ్‌ ఓ బిజినెస్‌మేన్‌. ఆర్జేగా పనిచేసే ఇషికాను ప్రేమిస్తాడు. డోపుల్‌గ్యాంగర్‌పై ఆసక్తితో తనలా ఉండేవారి కోసం ఓ వెబ్‌సైట్‌లో తన పేరు నమోదు చేసుకుంటాడు. అలా మంజునాథ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, అలాగే మైఖేల్‌ను కలుస్తాడు.

కథ:

వీరు గోవాలో మంచి స్నేహితులుగా మారతారు. మిగతా ఇద్దరి సాయంతో సిద్దార్థ్‌ ఇషికాను పెళ్లికి ఒప్పిస్తాడు. అయితేే మైఖేల్‌కు సంబంధించిన ఓ భయంకరమైన నిజం తెలిసి సిద్దార్థ్‌, మంజునాథ్‌ షాక్‌ అవుతారు. ఆ నిజమేంటి? మైఖేల్‌ ఎవరు? వీరిని ఎందుకు కలిశాడు? ట్రైలర్‌లో చూపినట్లు NIA అధికారులు వీరి వెంట ఎందుకు పడుతున్నారనేది మిగతా కథనం.

కొత్త కాన్సెప్ట్‌తో సినిమా అనగానే ప్రేక్షకుడు కొంత ఎగ్జైట్‌మెంట్‌తో థియేటర్‌కు వెళ్తాడు. కానీ సినిమాలో అది కాస్త మిస్‌ అయింది. డోపుల్‌ గ్యాంగర్స్‌ కాన్సెప్ట్ బాగానే ఉన్నా..కథనం నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం చాలా ఎక్కువ  సేపు ఉంది.

కథనం:

హీరో, హీరోయిన్ ప్రేమ కథ రొటీన్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో దాదాపుగా సినిమా ఫ్లాట్‌గా సాగుతుంది. ఎక్కడా వావ్‌ అనిపించే సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇంటర్వెల్‌ తర్వాత సినిమా వేగంగా ఉంటుంది. మంచి కాన్సెప్ట్‌కు తగిన స్థాయిలో ఉన్నట్లు అనిపించదు.

సినిమాలో సింహభాగం స్క్రీన్‌ప్రెజెన్స్‌ కల్యాణ్‌ రామ్‌కే ఉంటుంది. 3 పాత్రల్లో అద్భుతంగా చేశాడు. నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. ఆ పాత్ర ఇంకా బలంగా ఉంటే బాగుండేది. మిగతా రెండు పాత్రల్లోనూ కల్యాణ్‌ రామ్‌ అభినయం బాగుంది.

నటీ, నటులు

ఇషిక రంగనాథ్‌ తన పరిధిమేరకు బాగానే నటించింది. మంచి తెరంగేట్రమనే చెప్పుకోవచ్చు. బ్రహ్మాజీ కామెడీ బాగుంది. చాలాచోట్ల నవ్వులు పూయించాడు. జయ ప్రకాశ్ పరిధి మేరకు నటించాడు.

నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి కథ ఎంపికలో మంచి మార్కులే కొట్టేశాడు కానీ దానిని సరిగా అమలు చేయలేకపోయాడనిపిస్తుంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది.

దర్శకత్వం:

సినిమా ఎడిటింగ్ షార్ప్‌గా ఉండుంటే కాస్త బెటర్‌గా అనిపించేది. తమ్మిరాజు ఇంకాస్త కత్తెరకు పని చెప్పాల్సింది.

ఎడిటింగ్‌

సౌందర్‌రాజన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు తాను చేయగలిగింది చేశాడు.

సినిమాటోగ్రఫీ

అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ఇచ్చే జిబ్రాన్‌ కూడా ఈసారి నిరాశపరిచాడు. BGMపై ఇంకాస్త శ్రద్ధ పెట్టిఉంటే కొన్ని సీన్లు ఎలివేట్‌ అయ్యేవి.

మ్యూజిక్‌

నిర్మాణపరంగా మైత్రి మూవీ మేకర్స్ ఎప్పటిలాగే కాంప్రమైజ్‌ అవ్వలేదు. సినిమాకు ఎంతమేరకు అవసరమో అంతమేరకు నిర్మాణ విలువలు ఉన్నాయి.

నిర్మాణం:

కొత్త కాన్సెప్ట్ చూడాలనుకునేవారు వెళ్లవచ్చు. ఫస్టాఫ్ కాస్త బోరింగ్‌గా ఉంటుంది కానీ వీకెండ్‌లో సరదాగా చూడటానికి బాగుండే సినిమా.

రేటింగ్‌: 2.75

చివరి మాట

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.