Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవోగా మరో భారతీయుడు… నీల్ మోహన్ నేపథ్యంపై స్పెషల్ స్టోరీ
YouSay Short News App
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు
సుదీర్ఘ కాలంగా సీఈవోగా ఉన్న సూసన్ వొజిసికి పదవి నుంచి వైదొలగడంతో ఆయన ఈ పదవి చేపట్టారుప్రస్తుతం నీల్ మోహన్ యూట్యూబ్‌లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు
ఇప్పటికే ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది.ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ ఉన్నారు
భారతీయుల హవా
నీల్ మోహన్ లక్నోలో 1975లో జన్మించారు. ఆయన కుటుంబం తర్వాత అమెరికాలోని టెక్సాస్‌కు వలస వెళ్లింది.నీల్ మోహన్ అమెరికాలోని పెరిగి విద్యను అభ్యసించారు.
నీల్ మోహన్ నేపథ్యం
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చేశారు. 2008లో గూగుల్‌లో చేరిన నీల్ మోహన్ అంచలంచెలుగా ఎదిగారు.48 ఏళ్ల నీల్ మోహన్.. 2015 నుంచి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు
వృత్తి నేపథ్యం
1996లో యాక్సెంచుర్‌లో ఆయన తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నెట్ గ్రావిటీ స్టార్టప్‌లో చేరారుఆ సంస్థను ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సంస్థ డబుల్ క్లిక్ దాన్ని సొంతం చేసుకున్నది.
డబుల్‌క్లిక్ సంస్థను 2007లో గూగుల్ కొనుగోలు చేసింది. ఆ సమయంలో అడ్వాన్సింగ్ గూగుల్ అడ్వర్టైజింగ్ ప్రొడక్ట్స్ కోసం నీల్ మోహన్ పనిచేశారు.
యాడ్ వర్డ్స్, యాడ్ సెన్స్, డబుల్‌క్లిక్ లాంటి వాటిపై ఆయన పనిచేశారు. గతంలో మైక్రోసాఫ్ట్‌లో చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.
మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ స్ట్రాటజీ మేనేజర్‌గా నీల్ చేశారు.అమెరికన్ పర్సనల్ స్టయిలింగ్ సర్వీస్ స్టిచ్ ఫిక్స్‌లో బోర్డు సభ్యుడిగా నీల్ మోహన్ పని చేశారు.బయోటెక్ కంపెనీ23లో కూడా నీల్ తన సేవల్ని అందించారు
ప్రస్తుతం యూట్యూబ్ సీఈవోగా వ్యవహరిస్తున్న సుశాన్ వొజిస్కీ.. తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్టు బ్లాగ్‌పోస్టులో వెల్లడించారు.ఇకపై వ్యక్తిగత జీవితంపై దృష్టిసారించనున్నట్టు చెప్పారు. 2014లో ఆమె సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
కొత్త సీఈవో నీల్ మోహన్‌తో సూశాన్కు ఎంతో స్నేహపూర్వక అనుబంధం ఉంది. తొలుత వీరిద్దరు గూగుల్ ప్రకటనల విభాగంలో కలిసి పనిచేశారు.