Hyderabad: శంషాబాద్ వద్ద  తొలి ‘డ్రైవ్ ఇన్ థియేటర్’.. పార్ట్‌నర్స్‌గా రానా, మహేశ్, వెంకటేష్

YouSay Short News App

హైదరాబాద్‌లో తొలిసారిగా ‘డ్రైవ్ ఇన్ థియేటర్’ ఏర్పాటు కాబోతోంది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఈ థియేటర్‌ని సెటప్ చేయనున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ‘ఏఎంబీ క్లాసిక్’ పేరుతో ఈ ‘డ్రైవ్ ఇన్ థియేటర్’ సిద్ధం కానుంది.

ఏఎంబీ క్లాసిక్?

ఈ థియేటర్‌ ఏర్పాటులో సినీ ప్రముఖులు రానా దగ్గుపాటి, వెంకటేష్, మహేశ్‌బాబులతో సహా ఏషియన్ సినిమాస్ డైరెక్టర్ సునీల్ నారంగ్ భాగస్వాములు కానున్నారు.

వీరే భాగస్వాములు..

జీఎంఆర్ గ్రూప్‌తో ఈ నలుగురు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(PPP) పద్ధతిలో పనులు షురూ కానున్నాయి.

పీపీపీ పద్ధతిలో..

వీలైనంత త్వరగా థియేటర్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అన్నీ కుదిరితే దసరా నాటికల్లా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దసరాకు రెడీ?

గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్‌ను తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్‌నే ఈ ‘డ్రైవ్ ఇన్ థియేటర్’ నిర్మాణం కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

మళ్ళీ అతడితోనే..

డ్రైవ్ ఇన్ థియేటర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎంచక్కా కార్లలో కూర్చుని సినిమాను చూసే సదుపాయం కల్పించడమే ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ ముఖ్య ఉద్దేశం.

ఏమిటీ థియేటర్?

దాదాపు 150 కార్ల పార్కింగ్ సామర్థ్యంతో ఈ ‘డ్రైవ్ ఇన్ థియేటర్’ ముస్తాబు కానున్నట్లు సమాచారం. రెండు గేట్లను ఏర్పాటు చేయనున్నారు.

150 కార్లు పార్కింగ్..

ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుంది. వినోద ప్రియులకు ఇదొక పాపులర్ డెస్టినేషన్‌గా మారే అవకాశం ఉంది.

పాపులర్ డెస్టినేషన్‌గా..

సాయంకాలం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందేందుకు వీలు కలుగుతుంది. ఇదొక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

అద్భుత అనుభూతి..

హైదరాబాద్ వాసులకు విభిన్న వినోదాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ కాలం నుంచే ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ‘డ్రైవ్ ఇన్ థియేటర్’ ఆలోచనను ప్రభుత్వంతో హెచ్‌ఎండీఏ పంచుకుంది.

నాటి నుంచే..

ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్‌ చేంజ్‌ల వద్ద ఈ ‘డ్రైవ్ ఇన్ థియేటర్’లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. 19 ఇంటర్‌చేంజ్‌లలో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని హెచ్ఎండీఏకు ప్రభుత్వం సూచించింది.

ఇంటర్‌చేంజ్‌ల వద్ద..

పాశ్చాత్య దేశాల్లో ఈ ‘డ్రైవ్ ఇన్ థియేటర్’ సంప్రదాయం విస్తృతంగా వ్యాపించి ఉంది. దేశంలోని ముంబయి, చెన్నై, బెంగుళూరు, గురుగ్రాం, అహ్మదాబాద్‌లలో ‘డ్రైవ్ ఇన్ థియేటర్’ సేవలు అందుబాటులో ఉన్నాయి.

దేశంలో..

హైదరాబాద్ పరిధిలో ఇదివరకు ‘స్టార్‌లిట్ సినిమాస్’ ఇలా అప్పుడప్పుడూ ‘డ్రైవ్ ఇన్ థియేటర్’ సదుపాయాన్ని కల్పిస్తోంది. కానీ, శంషాబాద్ వద్ద శాశ్వతంగా ఈ తరహా థియేటర్ ఏర్పాటు కానుంది.

తాత్కాలికంగా..

కరోనా కారణంగా చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా సినిమాలకు దూరమయ్యారు. ఈ ‘డ్రైవ్ ఇన్ థియేటర్’తో ఈ సమస్య ఉండబోదు. ఎన్ని వైరస్‌లు వచ్చినా సినిమా నుంచి ప్రేక్షకుడిని దూరం చేయలేవు.

నో లిమిటేషన్..

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.