Hyderabad: సాఫ్ట్వేర్ డెవలపర్లకు అడ్డాగా హైదరాబాద్.. ఇండియాలోనే టాప్ సిటీ
YouSay Short News App
ఫార్ములా ఈ రేస్‌కి ఆతిథ్యం ఇచ్చి గ్లోబల్ సిటీస్ జాబితాలో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మరో కీర్తిని గడించింది. 2023లో సాఫ్ట్వేర్ డెవలపర్ల నియామకాలకు అడ్డాగా మారనుంది.
2023లో సాఫ్ట్వేర్ డెవలపర్ల రిక్రూట్మెంట్ అత్యధికంగా జరిగే భారతీయ నగరాల్లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది.
ఇండియాలోనే టాప్
ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల నియామకాలు అత్యధికంగా జరిగే నగరాల జాబితాలో హైదరాబాద్ టాప్ 10లో చోటు దక్కించుకుంది.
టాప్ 10లో చోటు..
అమెరికాలోని సియాటెల్‌కు చెందిన టెక్నికల్ ఇంటర్వ్యూ కంపెనీ ‘కరత్’(Karat) ఓ నివేదికను వెల్లడించింది. టెక్నికల్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపుతున్న సాఫ్ట్వేర్ డెవలపర్ల శాతాన్ని ఆధారంగా చేసుకుని ఈ రిపోర్ట్‌ను రూపొందించింది.
నివేదికలో వెల్లడి..
ఈ జాబితాలో 28శాతంతో హైదరాబాద్ 10వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో చోటు దక్కించుకున్నన ఏకైక భారత నగరం మన హైదరాబాదే.
ఏకైక భారతీయ నగరం
అమెరికన్ నగరాలైన వాషింగ్టన్, చికాగో, ఆస్టిన్, డెన్వర్, శాని డియాగోల, లాస్ ఏంజెలెస్లను సైతం హైదరాబాద్ వెనక్కి నెట్టింది.
వీటిని వెనక్కి నెట్టి..
టాప్ 20లో హైదరాబాద్‌తో పాటు మరో ఐదు భారతీయ నగరాలు చోటు సంపాదించాయి. వీటిలో చెన్నై, గురుగ్రాం, బెంగుళూరు, పుణే, ముంబయి ఉన్నాయి.
మరో 5 నగరాలు..
అమెరికా తర్వాత అత్యధికంగా ఐటీ హబ్స్ ఉన్న దేశం మన ఇండియానే. హైదరాబాద్, బెంగుళూరు, గురుగ్రాం నగరాల్లో టెక్ కంపెనీలు పుష్కలంగా ఉన్నాయి.
ఐటీ హబ్‌లకు కేరాఫ్..
హైదరాబాద్, చెన్నై, గురుగ్రాం, పుణే, ముంబయి నగరాల్లో అత్యధిక సంఖ్యలో సాఫ్ట్వేర్ డెవలపర్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. గ్లోబల్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతుండమే ఇందుకు కారణం.
డెవలపర్లు ఎక్కువే..
తొలిస్థానంలో సింగపూర్ నిలిచింది. రెండో స్థానంలో జపాన్‌లోని టోక్యో; మూడు, నాలుగు స్థానాల్లో కెనడా నగరాలైన వాంకోవర్, టొరంటోలు నిలిచాయి.
టాప్‌లో సింగపూర్
భారత్ నుంచి హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, అమెరికాలో సియాటెల్ మెట్రో ఏరియా, కెనడాలో వాంకోవర్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
ఆయా దేశాల్లో టాప్ నగరాలు
మరిన్ని కథనాల కోసం మా వెబ్సైట్ చూడండి. YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.