నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా ఎలాంటి బజ్ లేకుండానే థియేటర్లలోకి వచ్చేసింది.
వీరి కాంబోలో వచ్చిన ఊహలు గుసగుసలాడే,
జో అచ్యుతానంద మంచి హిట్ కావటంతో
ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులను వీరిద్దరూ మెప్పించారా? అవసరాల తన దర్శకత్వ ప్రతిభను చూపించాడో లేదో? చూద్దాం.
దర్శకుడు : అవసరాల శ్రీనివాస్నటీ నటులు : నాగశౌర్య, మాళవిక నాయర్సంగీతం : కల్యాణ్ మాలిక్సినిమాటోగ్రఫీ : సునీల్ కుమార్ నామా
చిత్రబృందం
సంజయ్ ( నాగశౌర్య ), అనుపమ ( మాళవిక నాయర్ ) మధ్య జరిగే లవ్, రొమాంటిక్ డ్రామా. కొన్నేళ్ల పాటు స్నేహంతో కలిసి ఉన్న ఈ ఇద్దరూ ప్రేమించుకోవటం, తర్వాత వాళ్ల మధ్య ఎదురయ్యే సమస్యలు, విడిపోవటం చివరకు మళ్లీ కలుసుకోవటం అనే సింపుల్ కథ.
కథేంటి?
కళాశాల నేపథ్యంలో జరిగే సన్నివేశాలతో సినిమా ప్రారంభించి ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చేందుకు అవసరాల ప్రయత్నించాడు. పాత్రల పరిచయం సింపుల్‌గా చేసి తన మార్క్ చూపించాడు.
ఎలా ఉందంటే?
హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. కథనం చాలా నెమ్మదిగా సాగుతుందని సగటు ప్రేక్షకులకు అనిపిస్తుంది.
ప్రేక్షకులు పూర్తిగా ఇబ్బంది కలగకుండా కామెడీతో కవర్ చేయాలని చూశాడు దర్శకుడు. అవి కొంత మేరకు మాత్రమే మెప్పిస్తాయి. అన్ని చోట్ల నవ్వులు పూయించకపోవటంతో ప్రేక్షకులకు ఆ భావన పోదు.
దాదాపు 10 సంవత్సరాలు కలిసి ఉన్న జంట కొన్ని అనుకోని కారణాలతో విడిపోవటంతో ఇంటర్వెల్‌కు చేరుతుంది. ఫస్టాఫ్ ముగిసే సరికే ప్రేక్షకులు నిరాశకు గురవుతారు.
సెకాండాఫ్‌లోనూ కథనంలో వేగం లేదు. క్లైమాక్స్‌ను చిన్న సింపుల్ పాయింట్‌తో ముగించేశాడు అవసరాల శ్రీనివాస్.
చిత్రం మెుత్తం నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరుగుతుంది. వీళ్లిద్దరూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరూ మరోసారి నటనలో తమ ప్రతిభ చూపించారు.
సాంకేతికంగా
నాగశౌర్యతో క్లాసిక్ హిట్స్ తీసిన అవసరాల శ్రీనివాస్‌కు ఓవర్సీస్లో మంచి పేరు ఉంది. కానీ, అక్కడ కూడా ప్రేక్షకులను సినిమా నిరాశపర్చింది.
సినిమా చూసిన వాళ్లందరూ చాలా స్లోగా ఉందని చెబుతున్నారు. అవసరాల ఈ సారి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయలేదని చెప్పవచ్చు.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలో ఏదైనా బాగుందంటే అది కళ్యాణ్ మాలిక్ సంగీతం మాత్రమే. ఇందులో ఉన్న రెండు పాటలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. బీజీఎం కూడా బాగుంది.
సునీల్ కుమార్ నామా సినిమాటోఫ్రీతో, కిరణ్ గంటి ఎడిటింగ్‌లో అద్భుతం అనిపించారు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో వాళ్ల నైపుణ్యంతో రాబట్టగలిగారు.