• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Appudo Ippudo Eppudo OTT: ఓటీటీలో దూసుకెళ్తోన్న నిఖిల్‌ ప్లాప్‌ చిత్రం.. కారణం ఏంటంటే?

    యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil Siddhartha) కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo OTT). సుధీర్‌ వర్మ (Sudhir Varma) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిఖిల్‌ జోడీగా రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth), దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik) నటించారు. నవంబర్‌ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో 20 రోజుల వ్యవధిలోనే మేకర్స్‌ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. అయితే థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని ఈ చిత్రం ఓటీటీ మాత్రం అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్‌ సహా, అంతా షాకవుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 

    ట్రెండింగ్‌లో నిఖిల్‌ చిత్రం..

    నిఖిల్‌ హీరోగా చేసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నవంబర్‌ 27న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకోకపోవడంతో ఓటీటీ రిలీజ్‌కు ముందు పెద్దగా హడావిడి జరగలేదు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రానికి ఓటీటీలో ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ నిమిషాలు పెరుగుతున్నట్లు ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అమెజాన్‌ ప్రైమ్‌లో దేశంలోనే తొలిస్థానంలో నిఖిల్‌ చిత్రం ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా అమెజాన్‌ వర్గాలు ప్రకటించాయి. దీంతో మూవీ టీమ్‌తో నిఖిల్‌ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    ఓటీటీలో ఆదరణ ఎందుకంటే

    నిఖిల్‌ లేటెస్ట్ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo OTT) యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అయితే థియేటర్లలో రిలీజ్‌కు ముందు పెద్దగా ప్రమోషన్స్‌ చేయకపోవడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. పైగా కరోనా కాలంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు పదే పదే చిత్ర బృందం చెప్పడం కూడా సినిమాను చూడాలన్న కోరికను సన్నగిల్లేలా చేసింది. దీంతో థియేటర్లలో చూసేందుకు పెద్దగా ఎవరు ఆసక్తి కనబరచలేదు. ఓటీటీలోకి వచ్చాక చూడచ్చులే అని అంతా భావించారు. రీసెంట్‌గా ఓటీటీలోకి రావడంతో యూత్ అంతా ఈ సినిమా చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ‘లక్కీ భాస్కర్‌’, ‘క’ చిత్రాలను అల్రెడీ థియేటర్లలో చూసిన నేపథ్యంలో ఓటీటీలో తమ తొలి ప్రాధాన్యతను ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’కి ఇచ్చారు. దీంతో నిఖిల్‌ చిత్రం ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది. 

    సినిమా చూడొచ్చా!

    దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్‌ స్టోరీ (Appudo Ippudo Eppudo OTT)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. కానీ, కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం తన మార్క్‌ చూపించాడు. మూడో వ్యక్తి (కమెడియన్‌ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల లవ్‌ ట్రాక్స్‌ బోరింగ్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. హీరో పరిచయం, అతడి పసలేని లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్‌ కలిగింది. సెకండాఫ్‌ పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్‌ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్‌ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్‌ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ మరింత మైనస్‌గా మారాయి. 

    కథేంటి

    హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్‌) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్‌) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. లవ్‌ ఫెయిల్‌ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్‌ తీసుకుంటూ పాకెట్‌ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్‌)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్‌ డాన్‌ బద్రినారాయణ (జాన్ విజయ్‌) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv