రిషి సునాక్

భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని

గురించి ఆసక్తికర విషయాలు

రిషి సునాక్ మే 12, 1980లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో స్థిరపడిన భారత మూలాలు ఉన్న కుటుంబంలో జన్మించారు.

రిషి జీవితం

రిషి తండ్రి యశ్విర్‌ కెన్యాలో పెరిగారు. తల్లి ఉషా సునాక్ టాంజానియాలో పుట్టారు. వారు ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. యశ్విర్ డాక్టర్‌ కాగా...ఉషా ఫార్మాసిస్ట్‌గా పనిచేసేవారు.

రిషి ముగ్గురు తోబుట్టువుల్లో అందరికన్నా పెద్దవారు. రిషి సోదరుడు సంజయ్‌ మానసిక వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. సోదరి రాఖీ న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఫండ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జేన్సీలో విధులు నిర్వర్తిస్తున్నారు.

తోబుట్టువులు

రిషి సునాక్ వించేస్టర్ కళాశాలలోచదువుకున్నారు. 2001లో ఆక్స్‌ఫర్డ్‌లోని లింకన్ కళాశాలలో.. తత్వశాస్త్రం, రాజకీయ, ఆర్థికశాస్త్రానికి సంబంధించిన పీపీఈ కోర్సు పూర్తి చేశారు. 2006లో 42 సంవత్సరాల వయసులోనూ స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

విద్యాభ్యాసం

రిషి, అక్షతమూర్తి ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఇద్దరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో 2006లో బెంగళూరులో వివాహం చేసుకున్నారు.

అక్షతతో ప్రేమ…

అక్షతమూర్తి ఇన్‌ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. రిషి, అక్షతమూర్తికి అనౌష్క, కృష్ణ ఇద్దరు సంతానం.

వివాహం, పిల్లలు

2001 నుంచి 2004 వరకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులో సునాక్‌ విశ్లేషకులుగా పనిచేశారు. హెడ్జ్ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేసి 2006లో ఆ కంపెనీలోనే భాగస్వామి అయ్యారు. ఆయన మామకు చెందిన కాటామారన్ వెంచర్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.

వ్యాపార అనుభవం

రిషి సునాక్ 2014లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌కు కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. 2015లో అదే ప్రాంతం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

రాజకీయంలోకి అడుగులు

2015 నుంచి 17 వరకు పర్యావరణం, ఆహారం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 2018లో థెరిసామే రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో స్థానికఅంశాలకు సంబంధించి ఉపమంత్రిగా పనిచేశారు.

2019లో జరిగిన ఎన్నికల్లో రిచ్‌మండ్‌ నియోజకవర్గం నుంచి రెండోసారి సునాక్ ఎంపీగా మరోసారి ఎన్నికయ్యారు.

2019 ఎన్నికలు

బోరిస్ జాన్సన్ హయాంలో ట్రెజరీ విభాగానికి ముఖ్యకార్యదర్శిగా నియమించబడ్డారు. జాన్సన్‌కు వ్యతిరేకంగా 2022 జూలై 5న మంత్రి సాజిద్ జావిద్‌తో కలిసి సునాక్ రాజీనామా చేశారు.

ఖజానాకు కార్యదర్శిగా

బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత లిజ్ ట్రస్‌తో ప్రధాని రేసులో నిలిచారు. ఎంపీల మద్దతు లేని కారణంగా ట్రస్‌పై 21 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ప్రధాని రేసులో

కింగ్ చార్లెస్- 3 అక్టోబర్ 25న సునాక్‌ను బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. ఆసియాకు చెందిన వ్యక్తి, ఓ హిందువు బ్రిటన్‌కు ప్రధాని కావటం తొలిసారి. రాజకీయాల్లో కేవలం 7 సంవత్సరాల్లోనే ప్రధానమంత్రిగా ఎన్నికై రిషి సునాక్‌ చరిత్ర సృష్టించారు.

బ్రిటన్ ప్రధానిగా