భార్య, చెల్లెలు, తల్లికి మగాళ్లు ఎలా అండగా నిలవాలి?
జాతీయ గృహిణుల దినోత్సవం ప్రత్యేకం
NOVEMBER 3
నవంబరు 3న జాతీయ గృహిణుల దినోత్సవాన్ని దేశమంతా జరపుకొంటారు.
కృతజ్ఞత ఆశించకుండా నిరంతరం కష్టపడే వ్యక్తి ‘గృహిణి’. వీరిని గౌరవించేందుకు ఏర్పాటు చేసుకున్నదే ఈ దినోత్సవం
సెలవు లేని శ్రామికురాలు.. జీతం తీసుకోని కార్మికురాలు.. అన్నీ తానై ఇంటిని నడిపించే యజమానురాలు. ఆమే గృహిణి. అలాంటి గృహ లక్ష్మి కష్టానికి వెలకట్టలేం. వారిని గౌరవించాల్సిన బాధ్యత భర్తలదే..
ఏవండోయ్ శ్రీవారు.. ఓ చిన్న మాట..!
తీరికలేకుండా గడిపే గృహిణులకు మీ వంతుగా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. వీలైతే ఇలా చేసి మనసు గెలుచుకోండి.
భర్తలు మీరే ఆలోచించండి!
వీకెండ్స్ శని ఆదివారల్లో ఈ ఒక్కరోజైనా ఆమెకు విశ్రాంతి నివ్వండి. ఇంటిపనుల నుంచి విముక్తి కల్పించండి.
విశ్రాంతి.. విముక్తి
తాను చేసే పనుల్ని మీరే సర్దండి. ఇల్లు, వంటగదిని పరిశుభ్రం చేసి అందంగా ముస్తాబు చేయండి.
మీ ఇల్లాలికి ఇష్టమైన వస్తువుని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేయండి. తన అభిరుచులకు ప్రాధాన్యమిచ్చి ఆ దిశగా మెలగండి.
శ్రీమతికో బహుమతి..
ఎప్పుడూ ఇంటి పనులతో సతమతమయ్యే మీ అర్ధాంగికి కాస్త ఉపశమనం ఇవ్వండి. ఏదైనా పిక్నిక్కి తీసుకెళ్లండి. హోటల్లో రుచికరమైన భోజనం తినిపించండి.
నెలకోసారి పిక్నిక్
ఇల్లాలిగా తన గౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నించండి. రోజూ కాసేపు తన సాధక బాధకాలు తెలుసుకోండి.
గౌరవం పెంచండి..
ఇంటి పనులే కదా అని తెలికగా కొట్టి పారెయొద్దు. ఆమెకష్టాన్ని గుర్తించి విలువనివ్వండి. నీకేం తెలుసు అని హేళన చేయకండి.
కష్టానికి విలువ..
ప్రతిరోజు ఇల్లాలికి సాయం కండి. కొంతమేర భారం తగ్గించండి. వీలైతే పనుల్ని పంచుకోండి. పిల్లల బాధ్యత తీసుకోండి.
పంచుకోండి ఇలా..
ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకోండి. వీలైతే మంచి హెల్త్ పాలసీని ఎంచుకోండి.
ఆరోగ్యంపై..
ఇల్లాలి మనసుకు నొచ్చే పనులు చేయకండి. తనను నవ్వించేందుకు కొన్ని కబుర్లు చెప్పండి.
కబుర్లు చెప్పండి..
తల్లితో కూడా మీ సుఖదు:ఖాలను పంచుకోండి. ఆమెతో కాస్త కాలం గడుపుతూ సపర్యలు చేయండి. యోగక్షేమాలు, అభీష్టాలను అడిగి తెలుసుకోండి.
తల్లికి సేవ..
ఇంటికి దీపం ఇల్లాలైతే.. దీపావళి ఆడపడుచు. మీ సోదరి బాగోగులపై కూడా శ్రద్ధ పెట్టండి. కష్టాల్లో నెనున్నాను అనే ధైర్యం ఇవ్వండి
ఆడపడుచును మరవొద్దు..
అత్తాకోడళ్ల మధ్య, వదిన, మరదళ్ల మధ్య మీరే వారధి. కాబట్టి వారిమధ్య సఖ్యత ఉండేలా
ఓ మంచి మార్గం వేయండి. వారి భావాలను గౌరవిస్తూ.. ఇంటిని కళకళలాడించండి.
సఖ్యత..
ఒక సర్వే ప్రకారం అమెరికాలో వారంలో 94 గంటలు గృహిణులు పనిచేస్తున్నారట. భారత్లో ఈ సమయం కాస్త ఎక్కువే.
మన ఇంటి గృహ లక్ష్మి కష్టం గురించి మీకు తెలుసా?
ఇండియాలో పల్లెల్లతో పోలిస్తే పట్టణాల్లో గృహిణులు ఎక్కువగా కష్టపడుతున్నారట. పట్టణాల్లో ఒక్కరే ఉంటుండటంతో భారం పడుతోందని సర్వేలు చెబుతున్నాయి.
పట్టాణల్లోనే ఎక్కువ..
ఆఫీసుల్లో మగవాళ్లు చేసే పనికి.. ఇల్లాలు చేసే కష్టం ఏ మాత్రం తీసిపోదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది.
సుప్రీం మాట..
రోజులో 16.9% గృహ అవసరాలకు, 2.6% సమయాన్ని ఇంట్లో వారిని చూసుకోవడానికి ఇల్లాలు కేటాయిస్తే.. మగవారు కేవలం 1.7%, 0.8% సమయాన్ని కేటాయిస్తున్నారు.
ఒక రోజులో..
గృహిణుల కష్టానికి గుర్తింపు కరువయ్యింది. ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులేయాలి.