ఆదివారం జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ 61(25) ఆటకు క్రికెట్ ప్రపంచం నివ్వెరబోయింది. అనూహ్యమైన షాట్లతో అందరినీ ఔరా అనిపించాడు
ఇండియన్ మిస్టర్ 360గా పేరు గడించిన సూర్య కుమార్ యాదవ్ షాట్లకు ప్రత్యర్థి జట్ల వద్ద సమాధానమే లేకుండా పోతోంది
2021 మార్చ్‌లో ఆరంగేట్రం చేసిన సూర్య.2022 నవంబర్ కల్లా అగ్రపీఠానికి చేరుకున్నాడు. ICC T20I ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు
2022 టీ20 వరల్డ్ కప్ సాధించడమే తన లక్ష్యమన్న సూర్య, టోర్నమెంట్‌లో ఇప్పటికే రెండు ప్లేయర్ ది మ్యాచ్ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు.
ఈ వరల్డ్ కప్‌లో సూర్య 75 సగటుతో 225 పరుగులు చేశాడు అది కూడా తిరుగులేని 193.96 స్ట్రయిక్ రేట్‌తో.
టీ20 వరల్డ్ కప్‌లో ఒక ఎడిషన్‌లో 200లకు పైగా పరుగులు సాధించిన ఏకైక మిడిలార్డర్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్
ఒక క్యాలెండర్ ఇయర్ 45కు పైగా సిక్స్‌లు బాదిన ఏకైక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్
ముంబయికి 2016, 2019 ఐపీఎల్ టైటిల్ విజయాల్లో సూర్య కీలక పాత్ర పోషించాడు
2019 టీ20 వరల్డ్ కప్‌లోనే సూర్య ఆడాల్సింది కానీ దురదృష్టవశాత్తు అతడికి అవకాశం రాలేదు
ఈ ఏడాది సూర్య కుమార్ యాదవ్ టీ20ల్లో 186.54 స్ట్రయిక్ రేటుతో 1026 పరుగులు సాధించాడు. అతడి తర్వాత స్థానంలో రిజ్వాన్ (924) కన్న సూర్య దాదాపు 30 ఓవర్లు తక్కువ బంతులు ఆడాడు
2010/11లో రంజీలో ఆరంగేట్రం చేసిన సూర్యకు పదేళ్ల కఠోర శ్రమ తర్వాత భారత జట్టులో చోటు దక్కింది
సూర్య కూల్ యాటిట్యూడ్ అనతి కాలంలోనే అతడికి అభిమానుల్ని సంపాదించి పెట్టింది.
సూర్య అసాధారణ ఆటగాడు, క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికాకుండా 360 డిగ్రీలలో షాట్లు కొట్టగలడు- డుప్లెసిస్
SKY స్పెషల్, SKY అవధులు లేనివాడు, అతడి ఆటను అలా చూస్తూ ఉండిపోవచ్చు- సెహ్వాగ్
సూర్య ప్రత్యేకమైన ఆటగాడు. వేరే గ్రహం నుంచి వచ్చాడేమో అన్నట్లు ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది- వసీం అక్రమ్