తెలుగు సినిమాలకు సంక్రాంత్రి పండుగ అతిపెద్ద సీజన్. వసూళ్ల పరంగా సినిమాలకు నిజంగా ఇది పండుగే. అందుకే సంక్రాంతిని సినిమాల పండగగా భావిస్తారు.
చిరంజీవి ‘భోళా శంకర్’, రామ్‌చరణ్ ‘ఆర్సీ15’, ప్రభాస్ ‘ఆదిపురుష్’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమళ్లు’ సినిమాలన్నీ తొలుత సంక్రాంతి డేట్లనే ఫిక్స్ చేశాయి. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నాయి.
రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్‌ల సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. మరోవైపు ప్రభాస్ ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. టీజర్‌కి వచ్చిన స్పందన ఆధారంగా గ్రాఫిక్స్‌పై చిత్రబృందం తుది మెరుగులు దిద్దుతోంది. అందుకే ఈ సినిమా ఆలస్యమవుతోంది.
చిరంజీవితో సంక్రాంతి పోరులో బాలయ్య నిలుస్తున్నారు. వీరిద్దరూ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ ఎదుట పోటీపడనున్నాయి.
చిరు ‘భోళాశంకర్’ సంక్రాంతి పోరు నుంచి తప్పుకున్నా, మెగాస్టార్ మాత్రం రేసులోనే ఉన్నారు. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతికే వస్తోంది. జనవరి 11న ఇది విడుదలయ్యే అవకాశం ఉంది.
బాలకృష్ణకు సంక్రాంతి హీరో అనే పేరుంది. తాజాగా బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న విడుదల కానుంది. 'అఖండ' విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో బాలయ్య ఉత్సాహంగా ఉన్నారు.
ఈ సంక్రాంతి రేసులో అనూహ్యంగా పోటీలోకి వచ్చిన సినిమా అఖిల్ ‘ఏజెంట్’. తామూ సంక్రాంతి రేసులో ఉన్నామని ప్రొడ్యూసర్లు ప్రకటించడం గమనార్హం. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది.
తమిళ హీరో విజయ్- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ‘వారసుడు’ డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. అజిత్ ‘తునివు’ కూడా పోటీలో ఉంది. ఇవే కాక మరో రెండు, మూడు అనువాద సినిమాలూ పోటీపడనున్నాయి.
ఇప్పటివరకైతే మూడు తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి రేసులో నిలిచాయి. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది.
మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి. సంక్రాంతి పందెం కోడిగా గెలిచేదెవరో వేచి చూడాలి.