YouSay Short News App

IND vs NZ: టీ20 సీరీస్ భారత్ కైవసం

ఇండియా న్యూజిలాండ్‌ మధ్య జరిగిన 3 టీ20ల సిరీస్‌1-0 తేడాతో భారత్ వశమైంది. తొలి మ్యాచ్‌ రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. మూడో టీ20 DLS ప్రకారం టైగా ముగియడంతో కప్పు భారత్‌ను వరించింది..

తొలుత కివీస్‌ బ్యాటింగ్

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మరోసారి ఓపెనర్‌ను త్వరగా కోల్పోయింది. 9 పరుగుల వద్ద ఫిన్‌ ఆలెన్‌ ఔట్‌ కాగా, 44 పరుగుల వద్ద చాప్‌మన్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్‌ (54)  అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు.

130/2 నుంచి 160 అలౌట్‌

15 ఓవర్లలో 130/2తో బలంగా కనిపించిన న్యూజిలాండ్‌ ఆ తర్వాత 5 ఓవర్లలోనే కుప్పకూలింది. చివరి 5 ఓవర్లలో కేవలం 30 పరుగులు చేసి  8 వికెట్లు కోల్పోయిది.

నిప్పులు చెరిగిన భారత పేసర్లు

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లు చెరో 4 వికెట్లతో చెలరేగారు. టీ20ల్లో భారత పేసర్లే 8 వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి. సిరాజ్‌ 4/17 భారత్‌ తరఫున న్యూజిలాండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు 8 వికెట్లు కోల్పోయిది.

ఛేదనలో తడబడ్డ టీమిండియా

భారత్ కూడా మొదటి 3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషభ్‌ పంత్‌ (11), ఇషాన్ కిషన్( 10), సూర్యకుమార్‌ యాదవ్‌ (13), శ్రేయస్ అయ్యర్‌(0) నిరాశపరిచారు.

ఆదుకున్న పాండ్యా- హుడా జోడీ

హార్దిక్ పాండ్యా(30), దీపక్ హుడా(9) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడారు. స్కోరుబోర్డు 9 ఓవర్లకు 75/4 వద్ద ఉన్నప్పుడు వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు.

DLS ప్రకారం టై

మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి భారత్‌ స్కోరు సరిగ్గా DLS స్కోరుకు సమంగా ఉంది. అంటే 75 పరుగుల వద్ద మ్యాచ్‌ తిరిగి ప్రారంభం కాకపోతే టై అయ్యే పరిస్థితి ఏర్పడింది.

కివీస్‌ కొంప ముంచిన శాంట్నర్

వర్షం పడడానికి ముందు 8.6వ బంతికి కివీస్ ఆటగాడు మిచెల్ శాంట్నర్ మిస్ ఫీల్డ్ చేశాడు. దీంతో ఒక పరుగు రావడంతో మ్యాచ్ టై అయ్యింది. అదే బంతిని పట్టుకుని ఉంటే డీఎల్ఎస్ ప్రకారం భారత్ ఓటమి పాలయ్యేది.

సిరాజ్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌

అద్భుతంగా బౌలింగ్ చేసిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో తన కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు సాధించాడు.

ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ‘SKY’

విధ్వంసక బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో పాటు మొత్తం 124 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు.

నవంబర్‌ 25 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సమరం మొదలుకానుంది. ఈ సిరీస్‌లో భారత జట్టుకు ధావన్‌ సారథ్యం వహించనున్నాడు.

ఇక వన్డే సమరం