టీ20 సిరీస్ ఓటమి అనంతరం ఆతిథ్య న్యూజిలాండ్ గొప్పగా పుంజుకుంది. వన్డే సిరీస్‌ని ఘన విజయంతో మొదలు పెట్టింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచులో చివరికి కివీస్‌నే విజయం వరించింది. ఈ మ్యాచులో ఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేశారు.
7వికెట్ల తేడాతో..
శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా తొలి వన్డేలో చేతులెత్తేసింది. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో 0-1తో వెనకబడి ఉంది.
బౌలింగ్ వైఫల్యం..
306/7. 50ఓవర్లకు టీమిండియా స్కోరు ఇది. ప్రయత్నిస్తే ఈ టార్గెట్‌ని కాపాడుకోవచ్చు. కానీ, మన బౌలర్లు విఫలమయ్యారు. దీంతో మరో 17 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఓటమిని అప్పగించేసింది.
ఆకట్టుకున్న ఉమ్రాన్..
ఈ మ్యాచుతో వన్డే అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్ కాస్త ఆకట్టుకున్నాడు. రెండు వికెట్లు తీసుకుని 66 పరుగులు సమర్పించుకుని స్పెల్‌ని పూర్తి చేశాడు. మరోవైపు, అర్షదీప్ సింగ్ పూర్తిగా నిరాశపర్చాడు.
20ఓవర్ల పాటు మనదే..
తొలి 20ఓవర్ల పాటు మ్యాచ్ టీమిండియా నియంత్రణలోనే ఉంది. కేవలం 88 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకుంది. బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మన్‌కి కాసేపు పరీక్ష పెట్టారు.
221 పరుగుల భాగస్వామ్యం..
వికెట్లు పడుతుంటే మరోవైపు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అడ్డుగోడగా నిలిచాడు. టామ్ లాథమ్ వచ్చాక ఇక పరుగుల వరద పారింది. వీరిద్దరూ కలిసి 221 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో వికెట్‌కి ఇది రెండో అత్యధిక అజేయ పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం.
రికార్డ్..
వన్డే ర్యాంకింగ్సులో తొలిస్థానంలో ఉన్న న్యూజిలాండ్ మరో ఘనత సాధించింది. సొంతగడ్డపై అత్యధిక వరుస విజయాలను సాధించ రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 2019 నుంచి జరిగిన 13 వన్డేల్లో గెలుపొంది విజయయాత్రను కొనసాగిస్తోంది.
టామ్ లాథమ్..
మ్యాచులో టామ్ లాథమ్ ఆటే హైలైట్. 104 బంతుల్లో 145 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
టిమ్ సౌథీ రికార్డ్
ధావన్ వికెట్‌తో టిమ్ సౌథీ రికార్డ్ నెలకొల్పాడు. టెస్టుల్లో తొలి 300 వికెట్లు, వన్డేల్లో తొలి 200 వికెట్లు, టీ20ల్లో తొలి 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు.
మెరిసిన టాప్ ఆర్డర్
బౌలింగ్ వైఫల్యం చెందినా టీమిండియా బ్యాటింగులో గొప్పగా రాణించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ముగ్గురూ అర్ధశతకాలతో మెరిశారు. ధావన్(72), గిల్(50), శ్రేయస్(80) పరుగులతో ఆకట్టుకున్నారు.
సంజుకి చోటు..
ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన అర్ష్‌దీప్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్ వన్డేల్లో ఆరంగేట్రం చేశారు. ఇటీవల చర్చల్లో ఉన్న సంజూ శాంసన్‌కు జట్టులో చోటు దక్కింది
IND: 1-21 ఓవర్లు
టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ధావన్, శుభ్‌మన్ గిల్ 21 ఓవర్ల పాటు ఎటువంటి రిస్క్ లేకుండా నెమ్మదిగా ఆడుతూ పోయారు. వికెట్ పడకుండా 100 పరుగులు చేశారు. ధావన్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు
ధావన్, గిల్ ఔట్
ఓపెనర్లిద్దరూ హాఫ్ సెంచరీలు చేశాక స్కోరు బోర్డును పరుగులు పెట్టించాలనే తొందరలో 24 ఓవర్లో గిల్ 50(65), 25 ఓవర్లో ధావన్ 72(77)ఔటయ్యారు.
ధావన్ రికార్డ్..
లిస్ట్ ఎ క్రికెట్లో 12వేల పరుగుల మైలురాయిని ధావన్ క్రాస్ చేశాడు. దీంతో టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా ధావన్ నిలిచాడు.
పంత్, అయ్యర్
ఓపెనర్లు ఔటయ్యాక వచ్చిన పంత్-శ్రేయస్ అయ్యర్ నెమ్మదిగా ఆడుతూ స్కోరును 32 ఓవర్లలో 150 పరుగులకు చేర్చారు.
ఒకే ఓవర్లో పంత్,సూర్య
లాకీ ఫెర్గూసన్ వేసిన 33వ ఓవర్ రెండో బంతికి పంత్ 15(23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య తొలి బంతికే ఫోర్ కొట్టినా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు
అయ్యర్- సంజూ
శ్రేయస్ అయ్యర్,సంజూ శాంసన్ కలిసి 45 ఓవర్ల వరకు వికెట్ పడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పోర్లు, సిక్సర్లతో 45 ఓవర్లకు జట్టు స్కోరును 248కి తీసుకెళ్లారు
46-50 ఓవర్లు
46వ ఓవర్‌లో మిలన్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ 37(16) ఫోర్లు సిక్సులతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్, ఠాకూర్ ఇద్దరూ ఔటయ్యారు.
శ్రేయస్ రికార్డ్
న్యూజిలాండ్ గడ్డపై వరుసగా 4 అర్ధశతకాలు చేసిన రెండో బ్యాటర్‌గా శ్రేయస్ రికార్డ్ సృష్టించాడు. అక్కడ గత నాలుగు ఇన్నింగ్స్‌లో 103(107), 52(57), 62(63), 80(76)(ఈ మ్యాచ్‌లో) చేశాడు.
కొత్త కథ, నేటి యువతకు తప్పకుండా నచ్చే సినిమా. ఈ వీకెండ్‌లో ప్రెండ్స్‌తో ప్లాన్ చేసుకోండి. తప్పక ఎంజాయ్ చేస్తారు
27న రెండో వన్డే
రెండో వన్డే ఈ నెల 27న హామిల్టన్ వేదికగా జరగనుంది. ఉదయం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి.