ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో హనుమాన్‌ ఎందుకు చూడాలి

YouSay Short News App

సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అనే మూసధోరణి అతడి సినిమాల్లో కనిపించదు. ఎన్నిసార్లు తీసిన కథే తెరకెక్కిస్తారని అనిపించదు. చిత్రాన్ని నడిపించే కథ, కథనం ఆ దర్శకుడి బలం.

అ, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన ప్రశాంత్ వర్మ..ఇప్పుడు సూపర్ హీరో హనుమాన్ సినిమాటిక్ ప్రపంచంలోకి తీసుకెళ్తానని అంటున్నాడు. మరి సినిమా ఎందుకు చూడాలి, దర్శకుడిని ఎందుకు నమ్మాలో తెలుసుకోండి.

సినిమాల్లోకి రాకముందు ప్రశాంత్ వర్మ షార్ట్ ఫిల్మ్స్,  యాడ్స్ కు దర్శకత్వం వహించాడు. తర్వాత నాని నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు చిత్ర  పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

ఆరంగేట్రం

మెగాఫోన్ పట్టుకున్నప్పటి నుంచే సరికొత్త కథలను ప్రశాంత్ వర్మ ఎంచుకున్నాడు. మూసధోరణితో సాగే ఆరు పాటలు, నాలుగు ఫైట్లతో కాకుండా సినిమాను నడిపించే కథను నమ్మి ముందుకు సాగుతున్నాడు.

విభిన్నమైన కథలు

ప్రతి కథకు స్క్రీన్‌ ప్లే ప్రాణం పోస్తుంది. దీనిని అవపోసన పట్టిన ప్రశాంత్‌.. ‘అ’ సినిమాలో ఒక హోటల్‌ చుట్టూ సాగే కథను చూపిస్తూ ఎమోషన్స్, డ్రామాను అదిరిపోయేలా తీశాడు. రివేంజ్ డ్రామా నేపథ్యంలో సాగే రాజశేఖర్ కల్కి చిత్రాన్ని తన మార్క్ స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లతో తీర్చిదిద్దాడు.

స్క్రీన్‌ ప్లే

హలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమైన జాంబీ కాన్సెప్ట్‌ను తెలుగులో పరిచయం చేసి వర్మ ట్రెండ్‌‌ సెట్ చేశాడు. తేజ సజ్జ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రయోగమనే చెప్పాలి.

జాంబి ట్రెండ్

ప్రతి సినిమాకు శైలిని మార్చుకుంటూ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్నివేశాలను తీర్చిదిద్దడంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆ పాత్రలు ఎంతవరకు నటించాలో, ఏ ఎమోషన్ ఎక్కడ పండించాలో జాగ్రత్త వహిస్తూ తన మార్క్ టేకింగ్‌తో సినిమాలు చేస్తున్నాడు.

టేకింగ్‌

ప్రేక్షకులను ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌తో కొత్తగా పలకరిస్తున్నాడు. మరోసారి తేజ సజ్జ హీరోగా హనుమాన్‌ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

PVCU

భారతదేశపు మెుట్ట మెుదటి పాన్ ఇండియా సూపర్ హీరో హనుమాన్ అంటున్నాడు ప్రశాాంత్. అంజనాద్రి ప్రపంచంలో హనుమాన్ సాహసాలను అద్భుతంగా చూపిస్తానని చెబుతున్నాడు.

సూపర్ హీరో

హనుమాన్‌ చిత్రంలో ప్రేక్షకులను లీనం చేసేందుకు మెుదటిసారి గ్రాఫిక్స్ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడు. టీజర్‌, ట్రైలర్‌లో విజువల్స్‌ చూస్తే మనకు అర్థం అవుతోంది.

గ్రాఫిక్స్

ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ గ్రాఫిక్స్‌పై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో టీజర్‌తో హనుమాన్ అదరగొట్టడంతో రెండింటికి పోలిక మెుదలయ్యింది. వందల కోట్లు ఖర్చు పెట్టిన ఆదిపురుష్ కంటే ఈ సినిమా చాలా బెటర్ అని కామెంట్స్ వచ్చాయి.

ఆదిపురుష్‌తో పోలిక

స్పైడర్‌ మ్యాన్, బ్యాట్‌ మ్యాన్‌ విదేశీ హీరోలైతే...భారతదేశపు సూపర్ హీరో హనుమాన్. పురాణాల్లో హనుమాన్ సాహసాలను ఎంతవరకు విన్నామో..ఇప్పటివరకు ఎలా చూశామో అంత అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడని ఇప్పటివరకు విడుదలైన టీజర్స్‌లో తెలుస్తోంది. ప్రశాంత్ టేకింగ్ మరోసారి మంత్రముగ్ధుల్ని చేయడం ఖాయమని భావించవచ్చు.

ఎందుకు చూడాలి

ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న మరో చిత్రం అధీరా, కల్యాణ్ దాసరి హీరోగా నటిస్తున్నాడు. ఈ సూపర్ హీరో కాన్సెప్ట్‌ గ్లింప్స్‌ కూడా ఆకట్టుకుంటోంది.

అధీరా

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.