REVIEW: “ముఖ చిత్రం” సినిమాకు విశ్వక్ మైనస్ ?

YouSay Short News App

ప్రియుడి మీద ప్రేమతో భర్తను చంపి అతడికి  ప్లాస్టిక్ సర్జరీ చేసి సంచలనం సృష్టించిన కేసు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి కథనే ఎంచుకొని తెరకెక్కించిన సినిమా “ముఖచిత్రం”.

కలర్ ఫొటో దర్శకుడు సందీప్‌ రాజ్ కథ, కథనం అందించడం. విశ్వక్ సేన్ గెస్ట్‌ రోల్‌తో అంచనాలు పెరిగాయి. మరి సినిమా ప్రేక్షకులను అలరించిందా? ఆసక్తికరంగా  ఉందా ? అనేది తెలుసుకుందాం.

రాజ్‌ కుమార్‌ ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. మహతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ, అతడిని మాయ ప్రేమిస్తుంది. ఓ రోజు మాయ ప్రమాదానికి గురై గాయపడగా...మహతి చనిపోతుంది.

కథ

మహతి ముఖాన్ని మాయకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన రాజ్‌..ఆమెను భార్యగా నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అతడిపై ఆమె ఓ విషయంలో కేసు పెడుతుంది. ఇలా ఎందుకు చేసింది అనేది కథ

సినిమా కథను వివరంగా చెప్పాలనకున్నాడేమో దర్శకుడు. సాగదీత సన్నివేశాలు పేర్చుకుంటూ పోయాడు. పాత్రల పరిచయం కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు.

కొద్దిసేపు భరించాలి

కాసేపు ప్రేక్షకులకు పరీక్ష పెట్టిన దర్శకుడు గంగాధర్ నెమ్మదిగా కథనంలోకి వేగంగా తీసుకెళ్లాడు. అనుకోకుండా జరిగే ప్రమాదాలు. ప్లాస్టిక్ సర్జరీ సన్నివేశాలతో ఆసక్తికరంగా మార్చాడు.

రూటు మారింది

సెకండాఫ్‌లో అసలు కథలోకి వెళ్లిన దర్శకుడు సెక్సువల్ రిలేషన్‌ పట్ల సమాజంలో ఉండే అపోహలు, భార్యను బానిసలుగా చూసే భర్తల గురించి ప్రస్తావిస్తూ ముందుకు నడిపించాడు.

కథనం

సున్నితమైన అంశాలను థ్రిల్లర్‌ కథాంశంతో ముడిపెట్టడం సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

మెచ్చుకోవచ్చు

సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతున్నప్పుడు విశ్వక్ సేన్ ఎంట్రీ. హీరోయిన్‌కు అతడు సాయపడటం. కోర్టు సన్నివేశాలు వకీల్‌ సాబ్‌ చిత్రాన్ని గుర్తు చేస్తాయి.

ట్రాక్ తప్పింది

ముఖచిత్రం సినిమాకు విశ్వక్‌ సేన్‌తో కోర్టు సన్నివేశాలు కాకుండా మరొకటి తీస్తే అద్భుతంగా ఉండేది అనిపించింది. కోర్టు సన్నివేశాలు బాగానే ఉన్నా ఇదే మైనస్‌గా మారిందని భావించవచ్చు.

క్లైమాక్స్‌

సినిమా మెుత్తానికి హీరోయిన్‌ ప్రియా వడ్లమాని పెద్ద ప్లస్‌ పాయింట్. చిత్రాన్ని ఆమె తన భుజాలపై మోసింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేస్తుంది.

ప్రియా వడ్లమాని

రాజ్‌ కుమార్ పాత్రలో వికాస్ వశిష్ఠ బాగా నటించాడు. కొత్తవాడైనప్పటికీ పరణితి కనబర్చాడు. అతడి మిత్రుడి పాత్రలో చైతన్య రావు నవ్వులు పూయించాడు. మిగతావారు పరిధిమేరకు నటించారు.

మిగతానటులు

కాలభైరవ థ్రిల్లింగ్ సినిమాకు కావాల్సిన బీజీఎంతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

సాంకేతిక పనితీరు

ప్రియా వడ్లమాని కథ బీజీఎం

ప్లస్

కోర్టు ట్రాక్

మైనస్‌

రేటింగ్: 2.75/5

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.