ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో సంచలనం జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేసిన పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన జాబితాలో చేరిపోయాడు. మిస్టరీ స్పిన్నర్‌గా పిలువబడే ఈ బౌలర్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు పరీక్ష పెట్టాడు. అద్భుతమైన బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోకుండా చేశాడు. మెుదటి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన ఇంగ్లాండ్ స్వల్ప స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయింది.