శ్రద్ధావాకర్ హత్యను ప్రేరణగా తీసుకొని తన ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని గణేష్ నగర్లో చోటు చేసుకుంది. తిలక్ నగర్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్(45)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని వదిలేసి గణేష్ నగర్లో ఉంటున్న తన ప్రేయసి రేఖారాణితో సహజీవనం చేస్తున్నాడు. మన్‌ప్రీత్‌తో తరచూ రేఖా గొడవ పడేది. వీరి మధ్య మనస్ఫర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో రేఖను కత్తితో పొడిచి చంపాడు. ఉంగరం వేలిని కోసేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.