పీవీఆర్ సినిమాస్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 20న సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రూ. 99లకే ఏ సినిమా అయినా చూడొచ్చని వెల్లడించింది. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. టికెట్‌పై జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఎంపిక చేసిన నగరాల్లోనే ఆఫర్ వర్తిస్తుంది. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో టికెట్ ధర రూ.100+ జీఎస్టీ కాగా..తెలంగాణలో రూ. 112+ జీఎస్టీ తీసుకుంటారు. కేవలం జనవరి 20న మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. రిక్లైనర్, ఐమాక్స్, 4Dఎక్స్ ప్రీమియం కేటగిరీ సీట్స్‌కి వర్తించదు.