టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల తల్లి స్వర్ణలతపై కర్ణాటకలోని అడుగుడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 3వ తేదీన తన ఇంట్లోకి స్వర్ణలత అక్రమంగా ప్రవేశించిందని శ్రీలీల తండ్రి శుభకర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా శ్రీలీల తల్లిదండ్రులు గత 20 సంవత్సరాలుగా వేరు వేరుగా ఉంటున్నారు. వీరి విడాకులు కోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది.