ప్రియాంక గాంధీ పర్సనల్ అసిస్టెంట్ సందీప్ కుమార్‌పై కేసు నమోదైంది. బిగ్‌బాస్ ఫేం అర్చన గౌతమ్‌ను సందీప్ అసభ్యకరంగా దూషించాడంటూ ఆమె తండ్రి గౌతమ్ బుద్ధ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 26న రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీకి అర్చన వెళ్లిందని, ప్రియాంక పీఏ సందీప్ తన కుమార్తెను లోపలికి వెళ్లనివ్వకుండా కులం పేరుతో దూషించాడని ఆరోపించాడు.