మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే సాంకేతికతను ఆరు నెలల్లో మనుషులపై ప్రయోగిస్తామని న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతిక గురించి తెలియజేశారు. మెదడులో పెట్టే చిప్‌తో పాటు దాన్ని పుర్రెలో పెట్టే రోబో గురించి వివరించారు. అవసరమైన అనుమతుల కోసం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థకు సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఎఫ్‌డీఏతో చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు.