ఉత్తర్ప్రదేశ్ లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. హసన్ గంజ్ రోడ్డులో నాలుగు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో కొందరు చనిపోయి ఉంటారని తెలుస్తోంది. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పాత భవనం అని అధికారులు తెలుపారు. భూకంపం ఏమైనా వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.