• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో వాషింగ్ పౌడర్ నిర్మా పోస్టర్ల కలకలం

    అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ పోస్టర్లు కనిపించాయి. ఈ పోస్టర్లలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రానే, బెంగాల్ నేత సువెందు అధికారి,సుజనా చౌదరి ఫొటోలు దర్శనమిచ్చాయి. పోస్టర్ కింద ‘వెల్ కమ్ టూ అమిత్ షా’ ట్యాగ్‌ లైన్ ఉంచారు. అవినీతికి పాల్పడిన నేతలు తమ కేసులను మాఫీ చేసుకునేందుకు బీజేపీలో చేరుతున్నారని గతంలో కేసీఆర్ ఆరోపించారు. పార్టీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా బీజేపీ నేతలు అవినీతి మరకలు చెరిపేస్తున్నారని విమర్శించారు.