ఒక్క పదంతో ఎయిర్‌ పోర్ట్‌లో రచ్చ

© Envato

ఎయిర్‌పోర్ట్‌ ఒక్క పదం కారణంగా ఎన్నో అనర్థాలు తలెత్తుతాయి. ఇటీవల ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు బాంబ్‌ అని పెట్టిన మెసేజ్‌ కారణంగా విమానమే ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాంటిదే మరో ఘటన భోపాల్‌ రాజాభోజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వెలుగుచూసింది. బలాస్ట్‌(ballast) అనే పదాన్ని విమానాశ్రయ ఉద్యోగి ‘బ్లాస్ట్’(blast) అనుకోవడంతో ఎయిర్‌పోర్ట్‌ భద్రతా సిబ్బంది ఒక్కసారిగా హై అలర్ట్‌ అయింది. బలాస్ట్‌ అంటే విమానంలో సరిపడా బరువు లేనపుడు బ్యాలన్స్‌ చేయడానికి ఉపయోగించే అదనపు బరువు. ఓ విమానానికి సంబంధించి బలాస్ట్‌పై ఎంక్వైరీ చేయగా ఆమె బ్లాస్ట్‌ అనుకుని భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చింది.

Exit mobile version