మారథాన్ అంటే దాదాపు 42.19 కిలోమీటర్లు. ఈ రన్నింగ్ పోటీలో పాల్గొనాలంటే తప్పకుండా సాధన చేసి ఉండాల్సిందే. అన్ని కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేయాలంటే మాములు విషయం కాదు. కానీ రన్నింగ్ పోటీలో రింకిల్ అనే బాతు పాల్గొంది. అంతేకాదు విజయవంతంగా రేస్ మొత్తం పూర్తి చేసింది. అది చూసిన వారు చాలా గ్రేట్ అని బాతును మెచ్చుకుంటున్నారు. ఈ రన్నింగ్ ఈవెంట్ ఇటీవల న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ లో జరిగింది. ఈ బాతు 2021లో న్యూయార్క్ లో జరిగిన మారథాన్ లో కూడా పాల్గొని ఫేమస్ అయ్యింది. ఈ వీడియోను seducktive బాతు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా నెటిజన్లు లైక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Cc_GPaiFiJ2/