కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు సెల్‌టవర్ ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు.. తన భూమి మీదుగా పంట కాలువ వెళ్తుండటంతో పరిహారం చెల్లించాలని నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తహసీల్దార్ వెలకట్టి రూ. 2 వేలు చెల్లించాడు. గతేడాది రైతులు సాగు చేయలేదు. ఈ సారి పంట వేసేందుకు సిద్ధమవ్వటంతో మళ్లీ పంట కాలువ వెళ్తుందనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.