రాయ్‌గఢ్‌లో ఘోర రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై జాతీయ రహదారిపై వ్యాన్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.