ఘోర రోడ్డు ప్రమాదం; ముగ్గురి మృతి

© Envato

ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద చోటుచేసుకుంది. బైక్‌ను మినీ లారీ ఢీకొట్టడంతో ముగ్గురూ స్పాట్‌లోనే మృత్యువాతపడ్డారు. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం కడియాల కుంటతండాకు చెందిన గోపాల్ నాయక్(47), అంజలి(42), స్వాతి(9)లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version