‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌పై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ కష్టపడే విధానాన్ని మెగాస్టార్ మెచ్చుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహిస్తాడని చిరు అభిప్రాయపడ్డారు. ‘పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ క్రేజ్ అందుకోవడం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి ఎంతో కష్టపడుతున్నాడు. బన్నీకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానానికి ఎదగడం ఖాయం’ అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.