తెలంగాణలో ఎండలు భగ్గు మంటున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా ఆదిలాబాలో 41.8, నిజామాబాద్ లో 41.3, హైదరాబాద్ లో 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మంగళవారం నుంచి 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.