స్టోన్ క్రషర్ యూనిట్లపై రూ.51.74 లక్షల జరిమానా

© Envato

సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 15 స్టోన్ క్రషర్ యూనిట్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. అక్రమంగా నిల్వలు చేస్తున్నారని గుర్తించి రూ.51.74 లక్షల జరిమానాను గనుల శాఖ విధించింది. 111 జీవో అమలులో ఉన్న ప్రాంతాల్లో ఈ యూనిట్లు నడుస్తున్నాయని NGT చెన్నై బెంచ్‌కి హైదరాబాద్‌కి చెందిన సుబ్రహ్మణ్య శర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే దాడులు నిర్వహించి చర్యలు తీసుకున్నారు.

Exit mobile version