• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విమానంలో బుల్లెట్ల కలకలం

    దక్షిణ కొరియాలో టేకాఫ్‌కు సిద్ధమైన ఓ విమానంలో బుల్లెట్లు దొరకటం కలకలం రేపింది. ఆ సమయంలో సుమారు 218 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్‌… టేకాఫ్ రద్దు చేశారు. ప్యాసింజర్లను దింపేసి భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఓ ప్రయాణికుడి దగ్గర 9ఎంఎం బుల్లెట్లు దొరికాయి. సెక్యూరిటీ పకడ్బందీగా తనిఖీలు చేపట్టినా బుల్లెట్లు ఎలా లోపలికి వెళ్లాయో అంతు చిక్కడం లేదని పోలీసులు తెలిపారు. ఎటువంటి ఉగ్రముప్పు లేదని తెలుసుకున్న తర్వాత మూడు గంటలు ఆలస్యంగా విమానం బయలుదేరింది.