తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు కలకలం రేపుతున్నాయి. ఇటీవల సస్పెండయిన జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ, రికార్డు అసిస్టెంట్ శ్రీరాములు, కాంట్రాక్ట్ ఉద్యోగి.. ఈ ముగ్గురు కలసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. ఇతరుల స్థిరాస్తి దస్తావేజులను ఉపయోగించి.. అవే నంబర్లతో ఇతరుల పేరుపై నకిలీ దస్తావేజులు తయారు చేశారు. డిజిటల్ కీ పాస్వర్డ్ ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు. భూదందాలు సృష్టించే ముఠా వీరి వెనుక ఉందని అనుమానిస్తున్నారు.