దేశం తరఫున ఫుట్‌బాల్ ఆడి ఇప్పుడు పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్న పౌలమి అధికారి గురించే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ. 2016లో అండర్ 16 ఆడిన పౌలమి… ఇప్పుడు జొమాటోలో డెలివరీ గర్ల్‌గా పనిచేస్తోంది. ఇళ్లు గడవటానికి ఇది తప్ప మరో దారిలేదని చెబుతోంది. శ్రీలంకలో జరిగిన అండర్ 16 పోటీల్లో గాయాలవ్వటంతో ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. ఫుట్‌బాల్ అసోసియేషన్ నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. దీంతో జొమాటోలో పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. రోజుకు రూ. 400 సంపాదిస్తున్నట్లు వెల్లడించారు.