ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది ముగిశాక బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకులను అనుమతిస్తారు. ఈ ఏడాది కూడా అధికారులు ఆ అవకాశం కల్పించారు. ఈనెల 15 వరకు ఉచితంగా రాష్ట్రపతి నిలయం సందర్శించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గడపొచ్చు. రాష్ట్రపతి నిలయం 75 ఎకరాల్లో విస్తరించి ఉంది. 20 గదులు ఉంటాయి. ఉద్యానవనాలు, ఫౌంటైన్లు, పచ్చదనం చూడముచ్చ టగా అనిపిస్తాయి. రాక్ గార్డెన్, జింకల పార్కును కూడా చూడవచ్చు.