హైదరాబాద్లోని అమీర్పేట్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తుపాకితో అందరిని బెదిరించాడు. నగరానికి చెందిన సాయికుమార్ గన్తో పాదచారులు, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకితో పాటు ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. విచారించిన తర్వాత పూర్తి వివరాలు చెబుతామన్నారు.
అమీర్పేట్లో గన్తో హల్చల్

© Envato