హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

yousay

హైదరాబాద్‌- ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్‌ షాపులో మంటలు ఎగసిపడుతున్నాయి. 2 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించకుండా అదుపు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల సికింద్రాబాద్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Exit mobile version