కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Courtesy Twitter:

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని అన్ని రక్షిత స్మారక చిహ్నాలు, స్థలాలకు సందర్శకులు, పర్యాటకులకు ఉచితంగా ప్రవేశం కల్పించనుంది. ఆగష్టు 5 నుండి 15వ తేదీ వరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పురావస్తు శాఖ ప్రకటించింది.

Exit mobile version