కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. అయితే, ఇండోర్లో అడుగుపెడితే రాహుల్ గాంధీని చంపేస్తామంటూ ఓ మిఠాయి దుకాణంలో దొరికిన లేఖ కలకలం రేపుతోంది. ‘మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ని చంపేస్తాం. నిన్ను(రాహుల్ గాంధీ) కూడా మీ నాన్న రాజీవ్ గాంధీ దగ్గరికి పంపిస్తాం’ అని లేఖలో రాసి ఉంది. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
రాహుల్ గాంధీని చంపేస్తామంటూ లేఖ

© ANI Photo(file)