వివాహితను హత్య చేసిన ప్రేమికుడు

© Envato:Representational

తనను ప్రేమించి.. వేరే వారిని పెళ్లి చేసుకుందని వివాహితను హత్య చేశాడో నిందితుడు. కర్ణాటకలో ఈ దారుణం జరిగింది. సౌమ్య, సుబ్రమణ్యం కాఫీడేలో పనిచేస్తున్న కాలంలో ప్రేమలో పడ్డారు. హఠాత్తుగా రెండు వారాల కింద సౌమ్య ఉద్యోగం మానేసి.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో వివాహిత ఇంటికెళ్లి ఆమెను కత్తితో పొడిచి సుబ్రమణ్యం పరారయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే సౌమ్య మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version